దసరా క్లైమాక్స్.. గూస్ బంప్స్

Mon Mar 20 2023 20:00:01 GMT+0530 (India Standard Time)

Update on Dasara Movie Climax Scene

నేచురల్ స్టార్ నాని హీరోగా పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న దసరా సినిమా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానున్న ఈ చిత్రంలో నానికి జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది.సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా పక్కా మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీగా బడ్జెట్ పెట్టి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో 17 నుంచి 18 నిమిషాల పాటు క్లైమాక్స్ సీన్ ఉండబోతోందట. ఈ సీన్ చూసిన ప్రతీ ఒక్కరికీ గూస్ బంప్స్ వచ్చేలా పూర్తి రాగా తీర్చిదిద్దారు.

క్లైమాక్స్ సీన్ తో సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుందని చిత్రబృందం చెబుతోంది. సినిమా మొత్తానికి ఈ సీన్ హైలెట్ గా నిలవబోతుందట. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేయగా.. 20 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించింది. అలాగే 4.60 లక్షల లైకులను రాబట్టింది.

చిత్తు చిత్తుల గుమ్మ అంటూ వచ్చే బతుకమ్మ పాటతో మొదలైన ఈ ట్రైలర్ లో.. నాలాంటి అమ్మాయి దొరికిందంటే.. ధరణిగా పెట్టి పుట్టావురా నా కొడకా అంటూ కీర్తి చెప్పే డైలాగ్ ఒక్కొక్కనికి మొల్తాడు కింద గుడాల్ రాల్తాయ్ బ్యాంచెత్ అని నాని చెప్పే డైలాగ్ లు ట్రైలర్ లో హైలెట్ అయ్యాయి.  అలాగే ఇటీవలే విడుదలైన చమ్కీల అంగీలేసి పాట కూడా నెట్టింటిని షేక్ చేస్తోంది. సినిమా టీజర్ పాటలు ట్రైలర్లు... చిత్రంపై భారీ అంచనాలు రేకెత్తిస్తున్నాయి.

నాని కీర్తి సురేష్ లు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి సముద్రఖని సాయి కుమార్ వంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు. సత్యం సూర్య సినిమాటోగ్రఫీ నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు. మార్చి 30వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖని సింగరేణి వద్ద జరిగింది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.