దసరా ఫస్ట్ డే బాక్సాఫీస్.. ఎంత వచ్చాయంటే?

Fri Mar 31 2023 11:13:16 GMT+0530 (India Standard Time)

Update on Dasara First Day BoxOffice

నాని హీరోగా రూపొందిన దసరా సినిమా శ్రీరామనవమి సందర్భంగా మార్చి 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నాని కెరియర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమా కేవలం తెలుగులోనే కాదు హిందీ కన్నడ మలయాళ తమిళ భాషల్లో సైతం విడుదలైంది.నాని హీరోగా నటించిన ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్గా కీర్తి సురేష్ నటించింది. దీక్షిత్ శెట్టి సాయికుమార్ సముద్రఖని ఇతర కీలక పాత్రలలో నటించగా మలయాళ నటుడు షైన్ చాం టాకో విలన్ పాత్రలో నటించాడు. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మించారు.

మొదటి ఆట నుంచి ఈ సినిమాకి మిక్స్ డ్ టాక్ రావడంతో కలెక్షన్స్ ఉహించినంతనే వచ్చాయి. తెలుగులో తప్ప మిగతా చోట్ల అంతంత మాత్రంగానే కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.. నాని హీరోగా నటించిన ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ రిపోర్టు ఎలా ఉందనేది పరిశీలిద్దాం.

నాని హీరోగా నటించిన దసరా సినిమా ఏరియాల వారిగా కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
నైజాం: 6.78 కోట్లు
సీడెడ్: 2.36 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.42 కోట్లు
తూర్పు గోదావరి: 90 లక్షలు
పశ్చిమ గోదావరి: 55 లక్షలు
గుంటూరు: 1.22 కోట్లు
కృష్ణాజిల్లా: 64 లక్షలు
 నెల్లూరు: 35 లక్షలు

 రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 14.22 కోట్ల షేర్ 24.85 కోట్ల గ్రాస్ సాధించింది.

కర్ణాటక సహా మిగతా భారత దేశంలో 1.52 కోట్లు ఇతర భాషలలో - 71 లక్షలు ఉత్తర భారతదేశంలో -55 లక్షలు ఓవర్సీస్ లో 4.10 కోట్లు కలెక్ట్ చేసి టోటల్ వరల్డ్ వైడ్ గా 21.10 కోట్ల షేర్ 38.6 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

ఓవరాల్ గా ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 48 కోట్ల బిజినెస్ జరిగింది దీంతో 49 కోట్లు సాధిస్తే సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఆ బ్రేకింగ్ సాధించాలంటే ఈ సినిమా ఇంకా 27 కోట్ల 90 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. మరి మిక్స్ డ్ టాక్ అందుకున్న దసరా మిగతా రోజుల్లో ఎంతవరకు నిలదొక్కుకుంటుందో చూడాలి.   


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.