బిగ్ బాస్ 7.. ఈసారి చాలా మార్పులు ఉన్నాయట..!

Fri Mar 17 2023 21:00:01 GMT+0530 (India Standard Time)

Update on Bigg Boss Season 7

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఆరు సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకుంది. అంతకుముందు వచ్చిన ఐదు సీజన్లు మంచి సక్సెస్ సాధించగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 మాత్రం ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు. రొటీన్ టాస్కులు.. పేలవమైన కంటెస్టంట్స్ ల ప్రదర్శన.. షో మీద ఆసక్తి లేకుండా చేశాయి. మొదటి నుంచి ఒక టాప్ కంటెస్టెంట్ ని విన్నర్ ని చేయాలని డిసైడ్ అయ్యి అతని మీద ఫోకస్ చేసినట్టు అనిపించింది. ఆడియన్స్ కూడా దాన్ని గుర్తించేలా చేశారు.  ఎలాగోలా సీజన్ పూర్తైంది.. ఫైనల్ ఎపిసోడ్ కూడా ఆకట్టుకోలేకపోయింది. సీజన్ 6 డిజాస్టర్ అవడం వల్ల హోస్ట్ గా నాగార్జున కూడా సీజన్ 7 ని కొనసాగించాలని అనుకోవట్లేదు.

ఇదేకాదు బిగ్ బాస్ నుంచి ఈమధ్య లీకులు ఎక్కువ అవుతున్న కారణంగా సెట్ ని కూడా ఇక్కడ నుంచి వేరే చోటికి షిఫ్ట్ చేస్తారని టాక్. మొదటి సీజన్ పూణెలో బిగ్ బాస్ సెట్ వేశారు. నామినేషన్స్ ఎలిమినేషన్ ఇలా ప్రతి దానికి ఆడియన్స్ లో ఒక ఆసక్తి ఉండేది. బిగ్ బాస్ సెట్ ఎప్పుడైతే అన్నపూర్ణ స్టూడియోస్ లో వేశారో.. అప్పటినుంచి లీకులు మొదలయ్యాయి.

సీజన్ 6లో ఎలిమినేట్ అయ్యేది ఎవరో ముందు రోజే తెలిసి.. ఎపిసోడ్ టైం లో పెద్దగా కిక్ లేకుండా పోయింది. అందుకే సీజన్ 7 నుంచి ఇలాంటి జరగకుండా జాగ్రత్త పడుతున్నారు బిగ్ బాస్ టీం. హైదరాబాద్ నుంచి బిగ్ బాస్ సెట్ ని చెన్నైకి షిఫ్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే అక్కడ నుంచి లీక్స్ రాకుండా కొత్త టీం ని ఏర్పాటు చేస్తున్నారట.

బిగ్ బాస్ సీజన్ 7 టీం లో టెక్నికల్ టీం కి తెలుగు వారికి ఛాన్స్ ఇవ్వట్లేదని తెలుస్తుంది. అంతేకాదు ఈసారి హోస్ట్ గా రానాని దించే ఛాన్సెస్ ఉన్నాయట. కంటెస్టంట్స్ కూడా బాగా తెలిసిన వాళ్లనే తీసుకుంటున్నారని తెలుస్తుంది.

మొత్తానికి బిగ్ బాస్ టీం భారీ మార్పులతో సీజన్ 7ని సిద్ధం చేస్తున్నారట. జూలై నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉంటుందని తెలుస్తుంది. ఈ సీజన్ లో లీక్స్ విషయంలో మాత్రం బిగ్ బాస్ సీరియస్ గా ఉంటుందని టాక్.   


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.