కాస్త ఆసక్తి కలిగించవయ్యా భోళా శంకర్..

Wed Mar 22 2023 10:04:55 GMT+0530 (India Standard Time)

Update on Bhola Shankar Film Release Date

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా భోళా శంకర్.   వాల్తేర్ వీరయ్య  లాంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత చిరంజీవి చేయబోతున్న సినిమా కావడంతో కచ్చితంగా మెగా ఫ్యాన్స్  ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఖచ్చితంగా నెక్స్ట్ లెవల్  హైప్ ఉండాలని భావిస్తుంటారు. సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చిన కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యేలా ప్లాన్ చేస్తారు.అయితే మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్ మూవీ విషయంలో మాత్రం  మొదటి నుంచి పెద్దగా హైప్ లేదనే చెప్పాలి. 2015లో వచ్చిన తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్ ఈ సినిమా ఆవిష్కరిస్తున్నారు.  నిజానికి ఆ సినిమా కూడా తమిళంలో యావరేజ్ టాక్ సొంతం చేసుకొని కమర్షియల్ గా మాత్రమే సక్సెస్ అయింది.  

మూవీలో గొప్పగా చెప్పుకునే కథ కూడా ఉండదు. అయితే మెహర్ రమేష్ మాత్రం మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా ఆ మూవీ స్టోరీ నెరేషన్ కంప్లీట్ గా మార్చినట్లు టాక్ వినిపిస్తోంది.

అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా మూవీని ఆవిష్కరించబోతున్నట్లుగా సమాచారం.  చిరంజీవి స్టైల్ లో ఫన్ రైడ్ కంటెంట్తో సినిమా  కథాంశం చెప్పబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుండగా తమన్నా హీరోయిన్ గా కనిపించబోతుంది. తాజాగా ఉగాది సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.  ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.  ఆగష్టు 11న  ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లుగా కన్ఫర్మ్ చేశారు.

 అయితే ఉగాది స్పెషల్ విషెస్ పోస్టర్ తో పాటు రిలీస్ అనౌన్స్మెంట్ చేస్తున్నట్లు ముందుగా చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడం విశేషం.  సినిమాపై బజ్ క్రియేట్ చేయాలంటే ముందుగానే స్పెషల్ అప్డేట్  ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు. దర్శకుడు మెహర్ రమేష్ ఈ విషయంలో ఫెయిల్ అయ్యారనే టాక్ మెగాస్టార్ అభిమానుల నుంచి వినిపిస్తోంది.  

ఫ్లాప్ దర్శకుడైనా మెహర్ రమేష్ కి దశాబ్దకాలం తర్వాత మరల మెగాస్టార్ చిరంజీవి అవకాశమిచ్చి ప్రోత్సహించారు. అయితే ఈ ట్రెండ్ ని అందుకోవడంలో మెహర్ రమేష్ కొంత వెనుకబడి ఉన్నాడనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.