బాలకృష్ణ 'రానా నాయుడు' కథ ఏంటి భయ్యా...?

Fri Mar 24 2023 05:00:01 GMT+0530 (India Standard Time)

Update on BalKrishna WebSeries

నందమూరి బాలకృష్ణ సినిమాలతో పాటు ఓటీటీ లో కూడా తెగ సందడి చేస్తున్నాడు. అన్ స్టాపబుల్ టాక్ షో తో అలరించిన బాలయ్య ఇప్పటికే రెండు సీజన్ లను ముగించాడు. ఈ ఏడాది చివర్లో మూడవ సీజన్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికంటే ముందే తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమం ద్వారా ఆహా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాడు.కేవలం టాక్ షో.. రియాల్టీ షో లో మాత్రమే కాకుండా బాలయ్య ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ లో కోసం బాలయ్య వెబ్ సిరీస్ చేసేందుకు గాను ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు అధికారికంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ స్క్రిప్ట్ చర్చలు జరుగుతున్నాయట.

వెంకటేష్ మరియు రానా కలిగి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సిరీస్ కు నెగటివ్ టాక్ వచ్చింది కానీ అత్యధిక జనాలు చూసిన వెబ్ సిరీస్ గా టాప్ 10 జాబితాలో రానా నాయుడు సిరీస్ నిలిచింది. హీరోగా బాలయ్య వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ సమయంలోనే వెబ్ సిరీస్ చేయడం అవసరమా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

వెంకటేష్ మరియు రానా కాంబినేషన్ లో వచ్చిన రానా నాయుడు వెబ్ సిరీస్ ఫలితం తర్వాత కూడా బాలయ్య ఒక వెబ్ సిరీస్ ను చేసేందుకు ఓకే చెప్పాలనుకోవడం ఆశ్చర్యంగా ఉందని టాక్ వినిపిస్తోంది. బాలకృష్ణ తో ఒక ప్రముఖ దర్శకుడు ఈ వెబ్ సిరీస్ ను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నాడట.

బ్యాక్ టు బ్యాక్ అఖండ.. వీర సింహారెడ్డి సినిమాలతో సూపర్ సక్సెస్ ను దక్కించుకున్న బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా ముగిసిన తర్వాత వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

వెబ్ సిరీస్ అంటే కాస్త బూతు మరియు శృంగారం ఉండాల్సిందే. కనుక బాలయ్య చేయబోతున్న ఆ వెబ్ సిరీస్ లో అవి కూడా ఉంటాయా అనేది చూడాలి. మొత్తానికి బాలయ్య ట్రెండ్ ను ఫాలో అవుతూ ఒక వైపు సినిమాలు చేస్తూ మరో వైపు ఓటీటీ లో సందడి చేస్తూ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు.