Begin typing your search above and press return to search.

టెన్ష‌న్ లోను ఎంజాయ్ చేసేవాడే ట్యాలెంటెడ్ స్పై!

By:  Tupaki Desk   |   19 Oct 2022 4:55 AM GMT
టెన్ష‌న్ లోను ఎంజాయ్ చేసేవాడే ట్యాలెంటెడ్ స్పై!
X
ర‌హ‌స్య ఏజెంట్ల జీవితం ఎప్పుడూ రిస్కుతో కూడుకున్న‌దే. ఎట్నుంచి ఏ ఎటాక్ ఎదుర‌వుతుందో ఊహించ‌లేరు. శ‌త్రువులు వెంటాడుతూ ఉంటారు. తాము వెంటాడే వాళ్లే ఎదురు తిరుగుతారు. భీక‌ర‌మైన వెప‌ర్ వార్ త‌ప్ప‌నిస‌రి. అయితే శ‌త్రువును ఎదుర్కోవాలంటే క‌థానాయకుడు ఎప్పుడూ టెన్ష‌న్ ప‌డితే స‌రిపోదు. తెలివైన ఎత్తుగ‌డ‌లతో ముందుకు సాగాలి. రిలాక్స్ డ్ గా ఉండేందుకు త‌న ఏర్పాట్ల‌లో తాను ఉండాలి.

గూఢచారి 007 సిరీస్.. బార్న్ సిరీస్ వీక్షించిన అభిమానుల‌కు ఇవ‌న్నీ తేలిగ్గానే అర్థ‌మ‌వుతాయి. ఇప్పుడు ఇంచుమించు బార్న్ ఐడెంటిటీ త‌ర‌హాలోనే అక్కినేని అఖిల్ ఏజెంట్ కూడా తెలుగు తెర‌పై బిగ్ స‌ర్ ప్రైజెస్ ఇవ్వ‌బోతోంది. ఈ సినిమాని పాన్ ఇండియా కాన్వాస్ కి మార్చ‌డంలోనే సురేంద‌ర్ రెడ్డి ఆలోచ‌న ఏమిట‌న్న‌ది అంద‌రికీ అర్థ‌మైంది.

బాండ్ సిరీస్ కి బార్న్ సిరీస్ కి త‌గ్గ‌ని విజువ‌ల్ రిచ్ మూవీని సూరి భారతీయ ఆడియెన్ కి అందించ‌నున్నారు. గూఢ‌చ‌ర్యం నేప‌థ్యంలో న‌భూతోన‌భ‌విష్య‌తి అన‌ద‌గ్గ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్స్ ని తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. ఈ మూవీలో ఒక్కో ఫైట్ సీక్వెన్స్ కోసం కోట్లు ధార‌పోస్తున్నార‌న్న టాక్ కూడా ఉంది. తొలుత అనుకున్న బ‌డ్జెట్ కంటే అమాంతం బ‌డ్జెట్ పెరిగింద‌ని ఇటీవ‌ల గుస‌గుస‌లు వినిపించాయి. కానీ సైరా లాంటి పాన్ ఇండియా సినిమాతో మెప్పించిన సురేంద‌ర్ రెడ్డి ఎట్టి ప‌రిస్థితిలో పాన్ ఇండియా హిట్టు కొట్టాల‌న్న క‌సితో ఉన్నారు.

అఖిల్ ని అందుకు త‌గ్గ‌ట్టే అత‌డు మ‌లుచుకున్నాడు. అఖిల్ లుక్ నిజంగా బిగ్ స‌ర్ ప్రైజ్. అత‌డు భీక‌రంగా కండ‌లు పెంచి మాన్ స్ట‌ర్ ని త‌ల‌పిస్తున్నాడు. అయితే ఎంత‌టి మాన్ స్ట‌ర్ అయినా కొంతైనా రిలీక్స‌వ్వాలి క‌దా? ఏజెంట్ అలా రెడ్ కార్ లో షికార్ కి వెళుతూ ఇలా రిలాక్స్ డ్ గా క‌నిపించాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ గా మారింది. B E L I E V E అంటూ ఆన్ లొకేష‌న్ కి సంబంధించిన ఫోటోని అఖిల్ స్వ‌యంగా రివీల్ చేసాడు. ఇది త్రోబ్యాక్ ఫోటో. అఖిల్ లుక్ రియ‌ల్లీ స్ట‌న్నింగ్ అంటూ అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు. ఏజెంట్ తో పాన్ ఇండియా హిట్టు కొట్టాల‌ని ఆకాంక్షిస్తున్నారు.

క్రిస్మ‌స్ పండ‌గ‌కు ఏజెంట్ రాక‌?

అఖిల్ 'ఏజెంట్' పాన్ ఇండియా కేట‌గిరీలో హిందీ స‌హా ద‌క్షిణాదిన అన్ని భాష‌ల్లో విడుద‌ల‌వుతోంది. హిందీ-తెలుగు-త‌మిళం-మ‌ల‌యాళం-క‌న్న‌డ‌లో ఈ చిత్రాన్ని అత్యంత భారీగా విడుద‌ల చేస్తామ‌ని ఇంత‌కుముందే టీమ్ ప్ర‌క‌టించింది. ముఖ్యంగా అఖిల్ - సూరి బృందం హిందీ ఆడియెన్ ని పెద్ద‌గా టార్గెట్ చేశార‌ని టాక్ వినిపిస్తోంది.

ఇటీవ‌ల ఏజెంట్ లుక్ ని విడుద‌ల చేయ‌గా అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఈ మూవీ కోసం అఖిల్ ఎంత హార్డ్ వ‌ర్క్ చేశాడ‌న్న‌ది అత‌డి మేకోవ‌ర్ చూస్తేనే అర్థ‌మ‌వుతోంది. ఇదంతా అఖిల్ త‌ప‌న‌.. క‌ష్టానికి ప్రూఫ్. అయితే పాన్ ఇండియ‌న్ మార్కెట్లో విజ‌యం సాధించ‌డానికి మంచి రిలీజ్ తేదీ చాలా ముఖ్యం. ద‌స‌రా మిస్స‌యింది. కాబ‌ట్టి క్రిస్మ‌స్ కి ఈ సినిమాని విడుద‌ల చేస్తార‌ని భావిస్తున్నారు. కానీ అధికారికంగా రిలీజ్ తేదీని చెప్పాల్సి ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.