నటి హోటల్ గదిలో సీలింగ్ ఫ్యాన్ కి ఉరి వేసుకుని మరణించింది. అయితే ఆమె ఆత్మహత్యకు ముందు ఒక షాడో మ్యాన్ తనతో 17 నిమిషాల పాటు సమయం గడిపాడు. ఇంతకీ ఎవరా షాడో మ్యాన్? అంటూ ఇప్పుడు పోలీసులు ఆరాలు తీస్తున్నారు.
భోజ్పురి నటి ఆకాంక్ష దూబే మార్చి 26న ఒక హోటల్ గదిలో శవమై కనిపించింది. ఇది ఆత్మహత్యగా అనుమానించినా కానీ పోలీసులు ఇంకా ఎటువంటి నోట్ ను స్వాధీనం చేసుకోలేదు. 25 ఏళ్ల యువనటి ఆకస్మిక మృతిపై దర్యాప్తు ప్రారంభించిన ఉత్తరప్రదేశ్ పోలీసులు ఉలిక్కిపడ్డారు.
ఇప్పుడు ఈ కథలో కొత్త ట్విస్ట్ బయటపడింది. నటి ఆకాంక్ష మరణించిన రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఆకాంక్షతో హోటల్ గదిలో 17 నిమిషాలు గడిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఆత్మహత్యకు అతడితో లింకేమిటి? అన్న కోణంలో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇది ఆత్మహత్యా? హత్యా? అన్నది కూడా విచారిస్తున్నారు.
ఆకాంక్ష ఇలా ఆకస్మికంగా ఎందుకు షాకింగ్ స్టెప్ తీసుకుంది? అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉండగా ఆకాంక్ష తల్లి తన కుమార్తె మరణానికి ప్రియుడు సమర్ సింగ్ అతని సోదరుడు సంజయ్ సింగ్ కారణమని ఆరోపించారు.
సమర్ సింగ్ తన కుమార్తెను కొట్టేవాడని అతని సోదరుడు చంపేస్తానని బెదిరించాడని ఆకాంక్ష తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆకాంక్ష మరణించినప్పటి నుండి సింగ్ సోదరులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు పలు ప్రదేశాలలో దాడులు నిర్వహిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.