Begin typing your search above and press return to search.

అప్డేట్ ఎఫెక్ట్.. ఫ్యాన్స్ కు క్లాస్ పీకిన NTR

By:  Tupaki Desk   |   6 Feb 2023 9:28 AM GMT
అప్డేట్ ఎఫెక్ట్.. ఫ్యాన్స్ కు క్లాస్ పీకిన NTR
X
కళ్యాణ్ రామ్ అమిగోస్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అగ్ర హీరో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క‌ళ్యాణ్ రామ్ గ‌త సినిమా బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌ గా హాజ‌ర‌య్యాడు. ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిల‌వ‌డంతో అదే సెంటిమెంట్‌ను అమిగోస్ సినిమాకు కొనసాగించారు.

ఇక ఈ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా ప్రారంభించి, పూర్తి చేసేలోపు దర్శకుడు రాజేంద్ర తల్లిదండ్రులు కాలం చేశారు. సినిమా మీద ఇంత డెడికేషన్‌ ఉన్నందుకైనా ఈ సినిమా మీకోసం హిట్ అవ్వాలి. ఈ తొలి సక్సెస్‌ను వారి తల్లిదండ్రులు చూస్తూనే ఉంటారు. మైత్రీ వాళ్లను నా నిర్మాతలు అని అనే కంటే.. వారు నా శ్రేయాభిలాషులు, నా కుటుంబ సభ్యులు అని చెప్పుకోవడం శ్రేయస్కరమ్. నేను, కొరటాల శివ వారి మీద జోకులు వేసుకునే వాళ్ళం. సుడితో వచ్చారని అనుకుంటాం. సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ చేసి.. రెండు హిట్ కొట్టడం వారికే సాధ్యమైంది.

అదే ఊపులో అమిగోస్ హిట్ అయి.. హ్యాట్రిక్ సాధించాలని కోరుకుంటున్నా. ఆశికకు తెలుగు ఇండస్ట్రీ తరుపున స్వాగతం పలుకుతున్న. ఆమె ఇంకా ఇలా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించాలి. ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి కారణమైన సాంకేతిక నిపుణులందరికీ థాంక్స్. కళ్యాణ్‌ రామ్ అన్న బాలగోపాలం సినిమా చేశాడు. నాకంటే ఆయనే సీనియర్. మా కుటుంబంలో ఎంత మంది హీరోలున్నా ప్రయోగాలు చేసింది మాత్రం కళ్యాణ్‌ అన్నే. హీరోగా, నిర్మాతగా ఇలా అన్ని రకాలుగా కొత్త ప్రయోగాలు చేస్తూ వచ్చారు. కమర్షియల్ సినిమాలు ఎప్పుడు చేస్తారని అనుకున్నాను. పటాస్, అతనొక్కడే వంటివి చేసి... బింబిసారాతో పూర్తిగా ఆకలి తీర్చారు. మూడు పాత్రలను పోషించడం ఎంత కష్టమో నాకు తెలుసు.

నేను కూడా జై లవకుశలో మూడు పాత్రలు చేశా. తెలుగు ప్రేక్షకులు మంచి చిత్రాలను ఆదరిస్తారని అందరికీ తెలిసిందే. సినీ అభిమానుల వల్లే ఆర్ఆర్ఆర్ సినిమాకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ఆర్ఆర్ఆర్ అనేది జక్కన్న విజయం. ఈ క్రెడిట్ అంతా ఆయనకే దక్కాలి. సినిమా అప్డేట్ కోసం మీ ఆరాటం, తాపత్రయం మాకు అర్థమవుతోంది. మీ వల్ల దర్శక నిర్మాతలకు ఒత్తిడి ఏర్పడుతుంది.

దాని వల్ల అందరికీ నష్టం కలుగుతుంది. తాజా న్యూస్ ఏంటంటే.. ఇంట్లో మా భార్య కంటే మీకే ముందుగా చెబుతాం. ఇప్పుడు మనం ప్రపంచ స్థాయిలో ఉన్నాం. మంచి సినిమా అందించాలని అనుకుంటాం. మంచి సందర్భం కోసం చూశాం. ఫిబ్రవరిలో సినిమా NTR 30ను ప్రారంభిస్తాం. మార్చి 20న షూటింగ్ ప్రారంభిస్తాం. 2024 ఏప్రిల్ 5న సినిమాను రిలీజ్ చేస్తాం' అని క్లారిటీ ఇచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.