Begin typing your search above and press return to search.

మళ్ళీ లైన్లోకి SSMB 28.. మరి ఈ సారైనా?

By:  Tupaki Desk   |   30 Jan 2023 7:00 AM GMT
మళ్ళీ లైన్లోకి SSMB 28.. మరి ఈ సారైనా?
X
సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB 28 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తెగ ఈగార్ గా వెయిట్ చేస్తున్నారు. మహేష్ ను బిగ్ స్క్రీన్‌పై చూసి సంద‌డి చేయాల‌నుకుంటున్న ఆయ‌న అభిమానుల‌కు వెయిటింగ్ త‌ప్ప‌లే లేదు. ఈ విష‌యంలో వారికి నిరాశ ఎదురుకానుంద‌ని సినీ సర్కిల్స్ స‌మాచారం. ఏ ముహూర్తాన సినిమాను మొద‌లెట్టారో కానీ.. సినిమా వెన‌క్కి వెళుతూనే ఉంది.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం... SSMB 28 షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. తొలి షెడ్యూల్ ఫిబ్రవరి 2వ తేదీన ముగుస్తుందని సమాచారం. అనంతరం రెండో షెడ్యూల్ రెండు వారాలపాటు కొనసాగుతుందని తెలుస్తుంది . అయితే అందులో కేవలం మూడు రోజుల పాటు మాత్రమే మహేష్ పై చిత్రీకరించనున్నారు. మిగతా రోజులు ఇతర తారాగణం పై షూట్ చేయనున్నారు. ఇక ఫిబ్రవరి మూడో వారంలో మూడో షెడ్యూల్ ను కొనసాగించనున్నారు.

SSMB 28 సినిమా రిలీజ్ విష‌యంలో మేక‌ర్స్ ముందుగా ఏప్రిల్ 28న సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే మ‌హేష్ కుటుంబంలో ఆయ‌న తండ్రి కృష్ణ‌, త‌ల్లి ఇందిరా దేవి చ‌నిపోవ‌టంతో సినిమా షెడ్యూల్స్ ఆగిపోయాయి. దీంతో సినిమా ప్లానింగ్ ప్ర‌కారం చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకోలేదు. ఈ ఎఫెక్ట్‌తో సినిమా రిలీజ్ డేట్ మారింది. సోష‌ల్ మీడియాలో వినిపిస్తోన్న వార్త‌ల మేర‌కు SSMB 28 సినిమా అక్టోబ‌ర్ 18న రిలీజ్ చేస్తార‌నే టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ అలియాస్ చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది. పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రం కోసం మహేష్ సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపించబోతున్నారు.

త్రివిక్రమ్ సినిమా తర్వాత మహేష్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తన 29 వ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా హాలీవుడ్ రేంజులో ఉంటుందని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి క్రేజ్ వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇక మహేష్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.