తుపాకీ పట్టిన `ఘోస్ట్` చేతిలో తల్వార్!

Sun Aug 14 2022 18:37:16 GMT+0530 (India Standard Time)

Update From Nagarjuna The Ghost Movie

కింగ్ నాగార్జున కథానాయకుడిగా యంగ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ` ది ఘోస్ట్` రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కింగ్ పవర్ ఫుల్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా  కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన నాగ్  పోస్టర్లతో ఆకట్టకున్నారు. ఇటీవల విడుదలైన `ఘోస్ట్` కిల్లింగ్ మిషన్ కి  అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఆఫీసర్ లుక్ లో నాగ్ యాక్షన్ మైండ్ బ్లోవింగ్ అనిపించింది.  స్పెషల్ యాక్షన్ బ్లాక్ ఫ్యాన్స్ సహా ఆడియన్స్ ని ఫిదా చేసింది. ఇక టీజర్...ట్రైలర్ తో డబుల్ ట్రీట్ షురూ అవుతుందని అభిమానులు కాన్పిడెంట్ గా ఉన్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా  ఘోస్ట్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. పోస్టర్ బ్యాక్ డ్రాప్ లో ఆకాశంలో  కమ్ముకొస్తున్న మేగాలు నాగ్ ముఖంలో ఎమోషన్ ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. కంటనీరు..చేతిలో తల్వార్ వెనుక ఎంతో ఎమోషన్ కనిపిస్తుంది. ఇంటర్ పోల్ ఆఫీసర్ చేతిలో తల్వార్? ఏంటి? అని కొత్త సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఇంటర్ పోల్ ఆఫీసరే ఘోస్ట్ గా మారతాడా? అన్న డౌట్ రెయిజ్ అవుతుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. పోస్టర్ అభిమానుల్ని ఆకట్టుకుంటుంది.

ఇక నాగార్జున ఇటీవలి కమర్శియల్ చిత్రాలతో పాటు డిఫరెంట్ జానర్లని టచ్ చేస్తున్నారు. వైల్డ్ డాగ్ తో నటుడిగా ప్రతమ్యేకమైన గుర్తింపు దక్కింది. కమర్శియల్ గా ఆశించిన అంచానలు అందుకోలేకపో యినా  విమర్శకులు మెచ్చిన చిత్రంగా నిలిచింది. అటుపై బంగార్రాజు  చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించారు. ప్రస్తుతం నటిస్తోన్న `ది ఘోస్ట్` రోల్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంది.  ఇలా నాగ్ రెండు జానర్లని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.

అలాగే `ఘోస్ట్` చిత్రాన్ని అక్టోబర్ 5న రిలీజ్ చేయడం మరో విశేషంగాను చెప్పొచ్చు. కింగ్ కల్ట్ క్లాసిక్..పాత్ బ్రేకింగ్ మూవీ శివ కూడా ఇదే రోజున రిలీజ్ అయి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ తేదీనే ఘోస్ట్ రిలీజ్ తేదీగా ఫిక్స్ చేయడం విశేషం.   ఈ చిత్రాన్ని పుస్కర్ రామ్మోహనరావు..శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.