Begin typing your search above and press return to search.

ఉపాస‌న‌.. అత్యంత విలువైన ఫోటో ఇది!

By:  Tupaki Desk   |   25 Sep 2021 11:30 AM GMT
ఉపాస‌న‌.. అత్యంత విలువైన ఫోటో ఇది!
X
మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాసాన కొణిదెల సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పాల్సిన ప‌నిలేదు. అందులోనూ ఉపాసన‌ ఇన్ స్టాలో ర‌క‌ర‌కాల అవేర్ నెస్ కార్య‌క్ర‌మాల‌తో పాటు వ్య‌క్తిగత వ్య‌వ‌హారాల్ని షేర్ చేస్తూ ఉంటారు. చ‌ర‌ణ్ అప్ డేట్స్ తో పాటు...వ్య‌క్తిగ‌త విష‌యాల‌న్ని...సామాజిక విష‌యాల్ని అక్క‌డ త‌రుచూ పంచుకుంటుంటారు. అలాగే మెగా క్యాపెనింగ్ కి సంబంధించిన వ్య‌వ‌హారాల్లోనూ కొణిదెల కోడ‌లు చాలా యాక్టివ్ గా పాల్గొంటారు. ఇక చ‌ర‌ణ్ ఫ్యామిలీ ప‌ట్ల ఉపాస‌న ఎంతో విన‌యంగా..విన‌మ్రంగా మెలుగుతారు. మావ‌య్య చిరంజీవి..అత్త‌మ్మ సురేఖ ల‌కు సంబంధించిన ఫోటోల్ని సైతం త‌న ఇన్ స్టా ఖాతాలో అప్ లోడ్ చేసి మెగా అభిమానుల‌ను ఖుషీ చేస్తుంటారు.

తాజాగా కొణిదెల‌-కామినేని రెండు కుటుంబాలు దిగిన ఓ ఫోటోని ఉపాసాన ఇన్ స్టాలో షేర్ చేసారు. ఇందులో చిరంజీవి-సురేఖ‌తో పాటు ఉపాస‌న త‌ల్లిదండ్రులు శోభ‌నా కామినేని- అనీల్ కామినేని కూడా ఉన్నారు. న‌లుగురు ఒకేచోట ఈ ఫోటో క‌లిసి దిగారు. మ‌రి ఈ క‌ల‌యిక అకేష‌నల్ గా జ‌రిగిందా? క్యాజువ‌ల్ గానే మీట్ అయి ఇలా ఒక్క‌టిగా ఫోటో దిగారా? అన్న‌ది తెలియాల్సి ఉంది. అత్యంత విలువైన ఫోటో ఇది అంటూ ఉపాస‌న ఆనందం వ్య‌క్తం చేశారు. ఈ ఫోటో పై మెగా అభిమానులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెట్టి అభిమానం కురిపిస్తున్నారు. అలాగే ల‌వ్ సింబ‌ల్ తో కూడిన ఎమోజీల‌ను.. సూప‌ర్బ్ ఫ్యామిలీ అంటూ ఉబ్బిత‌బ్బితున్నారు. అయితే వియ్యంకులు ఇలా క‌ల‌వ‌డం అనేది చాలా అరుదుగా జ‌రుగుతుంది.

సాధార‌ణంగా అకేష‌న‌ల్ గానే ఇలాంటి క‌ల‌యిక‌లు చోటు చేసుకుంటాయి. కానీ ఉపాస‌న మాత్రం ఆ గుట్టు విప్ప‌కుండా సస్పెన్స్ లో పెట్ట‌సారు. ప్ర‌స్తుతం చిరంజీవి `గాడ్ ఫాద‌ర్` లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే కొద్ది భాగం షూటింగ్ కూడా పూర్త‌యింది. ఈ చిత్రం మ‌ల‌యాళం సినిమా లూసీఫ‌ర్ కి రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత మెగాస్టార్ బాబి చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నారు.