త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్ - ఉపాసన దంపతులు అపోలో సామ్రాజ్యాధినేత.. ఫౌండర్ ప్రెసిడెంట్ డా.సి.ప్రతాప్ రెడ్డి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే 05 ఫిబ్రవరి తాతగారి పుట్టినరోజు సందర్భంగా ఉపాసన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాసన తన తాత ప్రతాప్ రెడ్డి తో కలిసి ఉన్న గ్రూప్ ఫోటోని షేర్ చేయగా అది వైరల్ గా మారింది. ఈ గ్రూప్ ఫోటోలో రామ్ చరణ్ ఉన్నారు.
టాలీవుడ్ ఆదర్శజంట రామ్ చరణ్-ఉపాసన ఇటీవలే తమ తొలి సంతానానికి సమయమాసన్నమైందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది మెగాభిమానులకు ఆనందాన్ని పంచింది. మెగా కుటుంబం ప్రస్తుతం సంబరాల్లో మునిగి తేలుతోంది.
ఉపాసన తాత .. అపోలో వ్యవస్థాపకుడు ప్రతాప్ రెడ్డికి ఇది 90వ పుట్టినరోజు కావడంతో తన సోషల్ ప్రొఫైల్ లలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎమోషనల్ నోట్ రాసింది. ప్రతాప్ రెడ్డి తన ఆప్యాయత దాతృత్వంతో చాలా మంది జీవితాలను స్పర్శించారని ఉపాసన రాశారు. 90 ఏళ్ల యువకుడు అంటూ హ్యాష్ ట్యాగ్ ని జోడించారు. ఉపాసన సోషల్ మీడియాలో తమ ఆరాధ్య కుటుంబ చిత్రాన్ని షేర్ చేయగా మెగాభిమానుల్లో వైరల్ గా మారింది.
ఉపాసన ప్రస్తుతం అపోలో హెల్త్ మ్యాగజైన్ మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. పలు సామాజిక కార్యక్రమాలతోను బిజీగా ఉన్నారు. మరోవైపు రామ్ చరణ్ వరుసగా భారీ ప్రాజెక్టులతో క్షణం అయినా తీరిక లేకుండా బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో ఆర్.సి 15 ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్. ఆ తరవాత ఉప్పెన బుచ్చిబాబు- జెర్సీ గౌతమ్ తిన్ననూరిలతో సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తోను సినిమాకి చరణ్ సన్నాహకాల్లో ఉన్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.