Begin typing your search above and press return to search.

ప్రాణిక్ హీలింగ్ ను ప్రమోట్ చేస్తున్న మెగా కోడలు ఉపాసన...!

By:  Tupaki Desk   |   7 July 2020 10:30 AM GMT
ప్రాణిక్ హీలింగ్ ను ప్రమోట్ చేస్తున్న మెగా కోడలు ఉపాసన...!
X
మెగా కోడలు.. హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన అందరికీ సుపరిచితమే. అటు మెగా ఫ్యామిలీ బాధ్యతలను ఇటు అపోలో హాస్పిటల్ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తోంది ఉపాసన. అపోలో లైఫ్ వైస్ చైర్‌ పర్సన్‌ గా మరియు బీ పాజిటివ్ మ్యాగజైన్ ఎడిటర్‌ గా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీకి కూడా సమయాన్ని కేటాయిస్తూ ఉంటుంది. అదే సమయంలో డిజిటల్ స్పేస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సోషల్ మీడియాలో ఆరోగ్య సంరక్షణ విధానాలను వివరించడంతో పాటు తనకు తోచిన చిట్కాలు చెప్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇటీవల లాక్ డౌన్ లో ఇంటికే ఎక్కువ సమయం కేటాయించిన ఉపాసన ఆయుర్వేద చిట్కాలు, వంటలు, సేంద్రియ వ్యవసాయం, ప్రాచీన పద్దతుల్లో ఆరోగ్యాన్ని సంరక్షించుకునే విధానాలని వివరిస్తూ వచ్చింది. ఇప్పుడు లేటెస్టుగా ఉపాసన సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఉపాసన కొణిదల తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ప్రాణిక్ హీలింగ్ ని ప్రమోట్ చేస్తూ పోస్ట్ పెట్టింది. ''ప్రాణిక్ హీలింగ్ మీ లైఫ్ నుండి నెగిటివిటీ తొలగించడానికి సహాయపడుతుంది అంతేకాకుండా మనతో పాటు ఇతరులను కూడా స్వస్థపరిచే శక్తి ఉందని ప్రతి ఒక్కరికి బోధిస్తుంది. నా ప్రాణిక్ హీలర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక టీవీ నటుడు. ఆయనకు ఇష్టమైన వ్యక్తి అనారోగ్యం కారణంగా యాక్టింగ్ ని వదులుకున్నాడు. అతను ఇప్పుడు ఫుల్ టైమ్ హీలేర్. అతనికి ఇష్టమైన వ్యక్తికి కూడా పూర్తిగా నయమైంది. చక్రాల ప్రతిష్టంభన అనేక ఆరోగ్య లేదా మానసిక సమస్యలకు మూల కారణం కావచ్చు. దీనికి బెస్ట్ నివారణ విల్ పవర్ అండ్ పాజిటివ్ ఎనర్జీ. నేను మన చుట్టూ ఉన్న వారి వైఖరిలో చాలా మార్పును చూశాను. నేను పవర్ ఆఫ్ ప్రానిక్ లేదా క్రిస్టల్ హీలింగ్‌ ను నమ్ముతున్నాను. అంతేకాకుండా మీరు కూడా దీనిని ప్రయత్నించమని రికమెండ్ చేస్తున్నాను'' అని పోస్ట్ చేసిన ఉపాసన తన ఫోతో పాటు హీలింగ్ చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఫోటోని కూడా షేర్ చేసింది.

అయితే ఉపాసన పోస్ట్ కి నెటిజన్స్ నుండి నెగిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మీరు ఇలాంటివి నమ్ముతారా.. అపోలో లైఫ్ వైస్ చైర్‌ పర్సన్‌ అయ్యుండి ప్రాణిక్ హీలింగ్ ని ప్రమోట్ చేయడం ఆశ్చర్యకరంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మీరు హాస్పిటల్ రన్ చేస్తున్నారనే విషయం మర్చిపోయారా.. మీరు హీలింగ్ ని నమ్మడానికి గల కారణాలు ఏంటి అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ ని నిర్వహిస్తూ ఇలా సూడో సైన్స్ ని ప్రమోట్ చేయడం దురదృష్టకరం అని విమర్శిస్తున్నారు. మీరు ఆధ్యాత్మిక భావాలు కలిగిన పర్సన్ అయ్యుండొచ్చు.. కానీ సైన్స్ ప్రూఫ్ లేని వాటికి ఎండోర్స్ చేయడం బాగాలేదు.. మనం ఇంతకముందే తన బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేసుకోలేక ట్రోల్ల్స్ ఎదుర్కున్న ప్రాణిక్ హీలర్ చూసాం.. మీలాంటి ఎడ్యూకేటెడ్ పీపుల్ ఇలా చేయడం కరెక్ట్ కాదని సోషల్ మీడియా వేదికగా సలహా ఇస్తున్నారు.