అన్ స్టాపబుల్.. పవన్ ఎపిసోడ్ కంటే ముందు మరొకటి?

Mon Jan 23 2023 22:00:01 GMT+0530 (India Standard Time)

Unstoppable.. Another one before the Pawan episode?

ఆహా ఒటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి ఎంత అద్బుతమైన రెస్పాన్స్ వచ్చిందో అందరికి తెలిసిందే. సీజన్ 1 కంటే సీజన్ 2కి మరింత ఎక్కువ హైప్ వచ్చింది. ఓ విధంగా చెప్పాలంటే టెలివిజన్ షోలతో పాటు ఓటీటీ షోలలో అన్ స్టాపబుల్ బెస్ట్ గా నిలిచింది. సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ కి నారా చంద్రబాబు నాయుడు రావడం సెన్సేషన్ అని చెప్పాలి. ఆ ఎపిసోడ్ కి అపూర్వ ఆదరణ లభించింది. నారా చంద్రబాబు నాయుడు ఆ ఎపిసోడ్ లో రాజకీయ జీవితంలో ఎన్టీఆర్ ని గద్దె దించిన సంఘటనపై వివరణ ఇచ్చారు. అలాగే తమ ఫ్యామిలీ కథలు చెప్పి కాస్తా ఎంటర్టైన్మెంట్ కూడా అందించారు.చంద్రాబాబుని మరో యాంగిల్ లో బాలకృష్ణ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ద్వారా చూపించారు. ఇక తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాల్గొన్న ఎపిసోడ్ కి అద్బుతమైన ఆదరణ వచ్చింది. ప్రభాస్ పాల్గొన్న షోని రెండు ఎపిసోడ్స్ గా ప్రసారం చేశారు.

ఇక ప్రభాస్ బాలకృష్ణ ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవల్ అనే హైప్ వచ్చింది.  అత్యధిక రేటింగ్ కూడా ఆ ఎపిసోడ్స్ కి వచ్చాయి. ఇక ప్రభాస్ ఎపిసోడ్ కి సంబందించిన టీజర్ ప్రోమోలకి సోషల్ మీడియాలో అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని మొదటి సారి బాలకృష్ణ హోస్ట్ గా ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఈ ఎపిసోడ్ కి సంబందించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది.

ఇక తాజాగా ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక వీరిద్దరి కలయికలో వస్తున్న ఎపిసోడ్ అప్పుడే రాజకీయంగా కూడా ఏపీలో సెగలు రేపుతుంది.

ముఖ్యంగా వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ని బాలకృష్ణ హోస్ట్ గా ఇంటర్వ్యూ చేయడంపై తెగ ఫీల్ అయిపోతున్నారు. విమర్శలు కూడా చేశారు. ఇక రాజకీయంగా పలు సంచలనాలు క్రియేట్ చేసే ఛాన్స్ ఈ ఎపిసోడ్ కి ఉందని అందరూ భావిస్తున్నారు.

అందుకే  ఆ ఎపిసోడ్ ని అన్ స్టాపబుల్ సీజన్ లాస్ట్ ఎపిసోడ్ గా ప్రసారం చేయాలని ఆహా టీమ్ భావిస్తుంది. ఇక 9వ ఎపిసోడ్ ఇప్పుడు తెరకేక్కించాలి. అయితే ఈ 9వ ఎపిసోడ్ కూడా గ్రాండ్ గా ఉండాలని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి వచ్చే స్థాయిలో రెస్పాన్స్ రాకున్నా కూడా దానికి దగ్గరగా ఉండేలా ఎపిసోడ్ 9ని తీసుకురావాలని భావిస్తున్నారు. దీనికోసం ఇప్పుడు ఏ స్టార్స్ ని తీసుకురావాలనే దానిపై ఆహా టీమ్ ఆలోచిస్తుంది. త్వరలో దానికి సంబందించిన క్లారిటీ కూడా వచ్చే ఛాన్స్ ఉందని బోగట్టా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.