అన్ స్టాపబుల్ 2 : చిరంజీవి - బాలయ్య పాన్ వరల్డ్ మూవీ..!

Thu Dec 01 2022 15:40:31 GMT+0530 (India Standard Time)

Unstoppable 2 : Chiranjeevi - Balayya Pan World Movie..!

ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 2 హోస్ట్ బాలకృష్ణ డబుల్ ఎనర్జీతో కొనసాగుతుంది. ఈ సీజన్ కి సంబందించిన లేటెస్ట్ ప్రోమో రిలీజైంది. 90 ఏళ్ల తెలుగు సినీ ప్రస్థానంలో తమ సినిమాలతో నిర్మాతలుగా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అల్లు అరవింద్ డి సురేష్ బాబు అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. తెలుగు పరిశ్రమలో ఉన్న కొన్ని విషయాల డౌట్లని ఇద్దరు బడా నిర్మాతల మొహం మీద అడిగేశారు బాలయ్య. తెలుగు పరిశ్రమలో ఆ నలుగురు అంటే అందులో ఇద్దరు మీరేగా అని అన్నారు. సంక్రాంతికి నా సినిమాకు ఎన్ని థియేటర్లు ఇస్తున్నారు అని బాలకృష్ణ అడిగారు.అన్ స్టాపబుల్ 2 లో ఐదవ ఎపిసోడ్ ప్రోమో అదరగొట్టేసింది. బడా నిర్మాతలు సురేష్ బాబు అల్లు అరవింద్ లు ఈ ఎపిసోడ్ లో పాల్గొన్నారు. వీరితో పాటుగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు కూడా షోలో పాల్గొన్నారు. ఇక తనతో ఎప్పుడు సినిమా తీస్తారని బాలకృష్ణ అల్లు అరవింద్ ని అడిగితే.. మీరు చిరంజీవి కలిసి సినిమా ప్లాన్ చేస్తున్నానని అన్నారు. అయితే అది పాన్ వరల్డ్ సినిమా అవుతుందని అన్నారు బాలయ్య.

ఇక మీరు బన్నీతో.. ఆయన వెంకీతో ఎలా వేగుతున్నారని బాలకృష్ణ అడగగా చెప్పుకోలేని కష్టాలు ఉన్నాయని అన్నారు అల్లు అరవింది. ప్రపంచంలో ఉన్న అన్ని భాషల సినిమాల కన్నా తెలుగు సినిమా ప్రత్యేకత ఏంటని అంటే.. తెలుగు సినిమా థాలి మీల్స్ లాంటిదని అన్నారు సురేష్ బాబు. 150 రూపాయల్ టికెట్ తో వస్తే వారు సంతృప్తి చెందేలా చేస్తుందని అన్నారు అల్లు అరవింద్.

రాఘవేంద్ర రావు కూడా జీవితమంతా నలభై ఏళ్లుగా వీళ్లిద్దరి మధ్య శాండ్ విచ్ అయ్యి ఉన్నాను.. ఇప్పుడు కూడా వీరి మధ్యే కూర్చోబెట్టారని అన్నారు. రాఘవేంద్ర రావు బి.ఏ అంటే బొడ్డు మీద యాపిల్ అంటూ అల్లు అరవింద్ పంచ్ వేశారు. దానికి వివరణ గా న్యూటన్ యాపిల్ పడినప్పుడు గ్రావిటీ కనుక్కున్నాడు.. తాను ఎక్కడ పడాలో కనుక్కున్నా అని అన్నారు రాఘవేంద్ర రావు.

ఇలా సరదా సంభాషణలతో పాటుగా ఇండస్ట్రీలో ఆ నలుగురు అంటూ వినపడే థియేటర్ల సమస్యల గురించి ప్రత్యేకంగా ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు బాలయ్య. నెపొటిజం మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు బాలయ్య.. ఇక దీనికి ఆన్సర్ గా తనని ట్రోల్ చేసినా పర్లేదు కానీ అంటూ అల్లు అరవింద్ తన ఆన్సర్ ఇచ్చినట్టు ఉన్నారు.    

ఓ రకంగా థియేటర్ల సమస్య.. ఈమధ్య సినిమాలకు ఏర్పడుతున్న కొన్ని గొడవల మీద ఈ ఇంటర్వ్యూలో బడా నిర్మాతలు సురేష్ బాబు అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందేమో చూడాలి. ఇక చివరగా ఎన్.టి.ఆర్ శత జయంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకుంటూ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. మొత్తానికి ఫుల్ ధమాకా ట్రీట్ అందించే ఈ ఎపిసోడ్ డిసెంబర్ 2న రాత్రి 9 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.