యూనివర్శిల్ స్టార్ లో అది ఏమాత్రం తగ్గలేదు

Thu May 12 2022 19:07:25 GMT+0530 (IST)

Universal Star Kamal Haasan

యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ దశాబ్ద కాలంగా సాలిడ్ కమర్షిల్ బిగ్గెస్ట్ సక్సెస్ ను దక్కించుకోలేక పోయాడు. ఈ దశాబ్ద కాలంలో కమల్ హాసన్ దృశ్యం రీమేక్ పాపనాశం తప్ప ఏ ఒక్క సినిమా తో కూడా మినిమం ఆకట్టుకోలేకపోయాడు అంటూ స్వయంగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు ఆయన నుండి విక్రమ్ సినిమా ఒక ఫుల్ ప్యాక్ కమర్షియల్ మూవీగా రాబోతుంది అంటూ అభిమానులు నమ్మకంతో ఉన్నారు.కమల్ హాసన్ విక్రమ్ మూవీ జూన్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించడంతో అంచనాలు పెరిగాయి. ఇక సినిమా అంచనాలు పెంచే విధంగా కమల్ లుక్ మరియు ఆయన పాత్ర ఉండటంతో సినిమా స్థాయి మరింతగా పెరిగింది.

సినిమాలోని ఒక పాటను తాజాగా విడుదల చేశారు. ఆ పాటను స్వయంగా కమల్ హాసన్ పాడి అందరిని ఆశ్చర్యపర్చాడు. ఏడు పదుల వయసుకు దగ్గర పడ్డ కమల్ హాసన్ ఈ వయసు లో కూడా పాటలు పాడటం అంటే ఆయన యొక్క పట్టుదలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

మాస్ సాంగ్స్ ను ఊపిరి బిగపట్టి పాడటం అంటే చాలా రిస్కు విషయం. దాన్ని కమల్ హాసన్ చాలా ఈజీగా మెయింటెన్ చేశాడు. ఆయన వయసు పెరిగినా కూడా పట్టుదల మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఆయన కు పని పట్ల ఉన్న అంకిత భావం కూడా ఏమాత్రం తగ్గలేదని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు లో విక్రమ్ సినిమా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. లోకేష్ గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఈ సినిమాను ప్రముఖ సంస్థ నాన్ థియేట్రికల్ రైట్స్ ను భారీ మొత్తానికి కొనుగోలు చేసి అందరికి షాక్ ఇచ్చింది. ఇప్పుడు సినిమా విడుదల తర్వాత ఏ రేంజ్ రచ్చ ఉంటుందో చూడాలి.