Begin typing your search above and press return to search.

దీపిక ఫ్రెగ్నెన్సీ.. ఇలాంటి టైమ్ లో ఊహించ‌ని ట్విస్టు..!

By:  Tupaki Desk   |   1 Aug 2021 5:34 AM GMT
దీపిక ఫ్రెగ్నెన్సీ.. ఇలాంటి టైమ్ లో ఊహించ‌ని ట్విస్టు..!
X
బ్యాక్ టు బ్యాక్ క్రేజీ పాన్ ఇండియా చిత్రాల‌తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక ప‌దుకొనే బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఓ వైపు క‌థానాయికగా న‌టిస్తూనే నిర్మాత‌గా సినిమాల‌కు పెట్టుబ‌డులు పెడుతోంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న ప్రాజెక్ట్ -కె లో అలాగే అల్లు `రామాయ‌ణం-ట్ర‌యాల‌జీ`లోనూ దీపిక న‌టించ‌నుంది. ఇలాంటి టైమ్ లో ఊహించ‌ని బిగ్ న్యూస్ బాలీవుడ్ స‌ర్కిల్స్ లో వేడెక్కిస్తోంది. దాదాపు 1000 కోట్ల ప్రాజెక్టులు క్యూలైన్ లో ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో ఇది ఊహించ‌ని ట్విస్టు..

దీపిక‌పై ర‌క‌ర‌కాల ఊహాగానాలు... స‌డెన్ గా స్ప్రెడ్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ క‌పుల్ రణవీర్ సింగ్ -దీపికా పదుకొణె శుక్రవారం సాయంత్రం ముంబైలోని హిందూజా ఆసుపత్రి నుండి బయటకు వ‌స్తూ మీడియా కంట ప‌డ్డారు. రణవీర్ - దీపిక ఇద్దరూ స్టైలిష్ క్యాజువల్స్ ధరించి సింపుల్ గా క‌నిపించారు. మాస్కులు కూడా ధరించారు. దీప్ వీర్ ఊహించని విధంగా హాస్పిటల్ కి వెళ్ల‌డం ర‌క‌ర‌కాల‌ ఊహాగానాలకు దారితీసింది. ఒక వర్గం అభిమానులు వారి ఆరోగ్యానికి ఏమైందోన‌ని ఆందోళన చెందుతుండగా.. దీపిక గర్భవతిగా ఉందో లేదో తెలుసుకోవడానికి మరొక సెక్ష‌న్ అభిమానులు ఆసక్తిని క‌న‌బ‌రిచారు.

దీపిక ఫ్రెగ్నెంట్ అయితే..? అంటూ చ‌ర్చ మొద‌లైంది. షారూఖ్ ఖాన్ తో ప‌ఠాన్ అలాగే హృతిక్ తో పాన్ ఇండియా మూవీ ఫైట‌ర్.. ప్ర‌భాస్ - ప్రాజెక్ట్ -కె వంటి చిత్రాలు చేస్తున్న దీపిక ఫ్రెగ్నెంట్ అయితే ప‌రిస్థితేమిటి.. అన్న‌ది చ‌ర్చ‌గా మారింది. ఇక అల్లు అర‌వింద్ - మ‌ధు మంతెన‌ల డ్రీమ్ ప్రాజెక్ట్ రామాయ‌ణం 3డిలోనూ దీపిక న‌టించాల్సి ఉండ‌గా.. ఇప్పుడు స‌డెన్ ట్విస్టుతో ర‌క‌ర‌కాల ఊహాగానాలు మొద‌ల‌య్యాయి.