చైతు.. కృతి.. పోస్టర్ అదిరింది..!

Wed Mar 22 2023 11:19:19 GMT+0530 (India Standard Time)

Ugadi Poster: Chaitu Krithi

అక్కినేని హీరో నాగ చైతన్య థ్యాంక్యు రిజల్ట్ తేడా కొట్టడంతో మళ్లీ కథల విషయంలో జాగ్రత్త వహిస్తున్నాడు. అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన లాల్ సింగ్ చద్దా సినిమాలో కూడా నటించాడు నాగ చైతన్య. ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం వెంకట్ ప్రభు డైరెక్షన్ లో కస్టడీ అనే సినిమా చేస్తున్నాడు నాగ చైతన్య.ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా నుంచి ఇప్పటికే టీజర్ రిలీజ్ అయ్యి అంచనాలు పెంచగా ఉగాది సందర్భంగా సినిమా నుంచి ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నుంచి వాళ్లిద్దరు హగ్ చేసుకున్న ఫోటో ఒకటి రిలీజ్ చేశారు.

భయంతో ఉన్న ప్రేయసికి నేను తోడున్నా అంటూ ఆ కౌగిలిలో ఒక నమ్మకాన్ని కలిగించేలా ఈ పోస్టర్ కనిపిస్తుంది. అందుకే పోస్టర్ ని క్లియర్ గా అబ్సర్వ్ చేస్తే చైతన్య కళ్లలో తెగింపు.. కృతి చూపుల్లో భయం కనిపిస్తుంది. సినిమాలో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. నాగ చైతన్య ఇలాంటి డిఫరెంట్ రోల్ చేయడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు.

నాగ చైతన్య కృతి శెట్టి జోడీ గురించి చెప్పాలంటే ఆల్రెడీ ఈ ఇద్దరు కలిసి బంగార్రాజు సినిమాలో నటించారు. ఆ సినిమాలో వీరి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. బంగార్రాజు హిట్ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తూ నాగ చైతన్య కస్టడీ వస్తుంది.

ఈ సినిమాలో కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో నాగ చైతన్య వింటేజ్ నాగార్జున లుక్స్ ని తలపిస్తారని తెలుస్తుంది. ఆల్రెడీ టీజర్ లోని ఒక షాట్ ఇప్పటికే అక్కినేని ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది.

మొత్తానికి నాగ చైతన్య కృతి శెట్టి కలిసి మరోసారి ప్రేక్షకులను మెప్పించాలని వస్తున్నారు. సమ్మర్ కానుకగా మే 12న ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. సినిమాతో పాటుగా విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో ధూత వెబ్ సీరీస్ చేస్తున్నాడు నాగ చైతన్య.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.