Begin typing your search above and press return to search.

మాజీ మిస్సు అందాల న‌టికి ప‌డిపోయిన బిలియ‌నీర్

By:  Tupaki Desk   |   27 May 2023 6:00 AM GMT
మాజీ మిస్సు అందాల న‌టికి ప‌డిపోయిన బిలియ‌నీర్
X
కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) .. మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ సురేశ్ కొటక్ కుమారుడు జే ఇటీవల తన ఫియాన్సీ వివ‌రాల్ని ప్ర‌క‌టించారు. అందాల‌ పోటీల యువ‌రాణి ఫెమినా మిస్ ఇండియా 2015 విజేత అయిన అదితి ఆర్యతో తన నిశ్చితార్థాన్ని ట్విట్టర్ పోస్ట్ లో ధృవీకరించారు. యునైటెడ్ స్టేట్స్ లోని ప్రీమియర్ ఇన్ స్టిట్యూట్ లలో ఒకటైన యేల్ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసిన అదితి కోసం జే హృదయపూర్వక సందేశం అందించారు.

కాన్వొకేషన్ వేడుక నుండి అదితి ఫోటోలను పంచుకుంటూ జే బుధవారం ట్వీట్ చేసారు. ``నా కాబోయే భార్య అదితి ఈ రోజు యేల్ విశ్వవిద్యాలయంలో MBA పూర్తి చేసింది. మీ విష‌యంలో చాలా గర్వంగా ఉంది`` అన్నారు. వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా సహా పలువురు వ్యక్తులు ఈ జంటను అభినందించారు. వారి ఆనందంగా కొత్త‌ జీవితంలో ప్ర‌వేశించాల‌ని ఆకాంక్షించారు.

*గురుగ్రామ్ అమ్మాయి అదితి 2015లో అందాల పోటీల 52వ ఎడిషన్ లో ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. చైనాలో జరిగిన మిస్ వరల్డ్ 2015లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అయితే ఈ పోటీలో స్పెయిన్ కు చెందిన మిరియా లాలాగునా రోయో కిరీటాన్ని గెలుచుకున్నారు. ఎడ్యుకేషనల్ పరంగా చూస్తే అదితి ఈ సంవత్సరం యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. అంతకు ముందు మిస్ ఇండియా కిరీటాన్ని పొందే ముందు ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని షహీద్ సుఖ్ దేవ్ కళాశాల నుండి బిజినెస్ స్టడీస్ లో అండర్ గ్రాడ్యుయేట్ చదువును పూర్తి చేసింది.

*2015లో అందాల పోటీలో పోటీ చేయడంతో పాటు ఆమె ఆడిట్ సంస్థ అయిన ఎర్నెస్ట్ అండ్ యంగ్ లో రీసెర్చ్ అనలిస్ట్ గా కూడా పని చేస్తోంది.ఆ సమయంలో అనేక ఇంటర్వ్యూలలో MBA చదవాల‌న్న‌ ఆసక్తిని వ్యక్తం చేసింది.

*29 ఏళ్ల నటి ఎల్లప్పుడూ బహిరంగ వేదికలపై విద్య ప్రాముఖ్యత గురించి గళం విప్పింది. నేర్చుకోవడం అనేది సామాజిక అంచనాల కోసం కాదు.. సమాజం మీకు అందించిన వాయిస్ తో మెరుగ్గా పనిచేయడం కోసం” అని ఆమె గత సంవత్సరం ఇన్ స్టాగ్రామ్ లో వ్యాఖ్య‌ను జోడించారు.

*అదితి ఇన్ స్టాగ్రామ్‌ సహా సోషల్ మీడియాలో మంచి ప్రజాదరణ పొందింది. ఈ వేదిక‌పై ఆమెకు 3.4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె 2021లో విడుదలైన రణవీర్ సింగ్ నటించిన చిత్రం 83తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం 1983లో టీమిండియా ప్రపంచ కప్ విజయం నేప‌థ్యంలో మాజీ టీమిండియా కెప్టెన్ కపిల్ దేవ్ క‌థ‌తో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా.