జిమ్ లో హీరోయిన్ రెండేళ్ల శ్రమ..రిజల్ట్ మాత్రం శూన్యం!

Thu Jun 30 2022 09:00:01 GMT+0530 (India Standard Time)

Two years of hard work of Rashi Khanna in gym No Result

రాశీఖన్నా అందం..అభినయం గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడిలో యాక్టింగ్ లో వీక్ అయినా..తెలివిగా  గ్లామర్ తో అవకాశాలు ఒడిసిపట్టుకుంటుంది. ఇక కెరీర్ ఆరంభంలో అమ్మడు  బొద్దు అందం అంతే హైలైట్. కాలక్రమేణా ఆ  బొద్దుతనం మరింత పెరిగింది. ఒకానొక దశలో పూర్తిగా చబ్బీ లుక్ లో ఎక్కువ హైలైట్ అయింది.ఇలాగైతే రాశీఖన్నా కెరీర్  వేగంగానే ముగించాల్సి వస్తోందని విమర్శలు తెరపైకి వచ్చాయి. కానీ ఆ వెంటనే రాశీ విమర్శల్ని గమనించి ఫిట్ నెస్ పై దృష్టి పెట్టింది. శరీరంలో అనవసరంగా పేరుకుపోయిన కొవ్వుని కరిగించే ప్రయత్నం మొదలు పెట్టింది. రెండేళ్ల పాటు శ్రమించింది. కానీ పలితం కనిపించలేదు. అవును రాశీ రెండేళ్ల జిమ్ కష్టం ఎంతగా వృద్ధా అయిందో తెలుస్తుంది.

''వెయిట్ పెరగడంతో  తగ్గడం కోసం యాధావిధిగా రెండేళ్ల పాటు జిమ్ చేసిందిట. కానీ ఈ రెండేళ్లలో కేజీ బరువు కూడా తగ్గలేదు. దీంతో శరీరం లోపల ఏం జరుగుతుందో? అర్ధం కాని పరిస్థితి ఏర్పడిందిట. మరోవైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్ లు..దీంతో ఒకింత డిప్రెషన్  కి గురయ్యాను. జిమ్ కి వెళ్లడం అప్పటికే అలవాటు. కానీ ప్రధానంగా ఆ రెండేళ్లు వెయిట్ లాస్ కాకపోవమే ఇబ్బంది కరంగా మారింది.

అప్పుడే థైరాయిడ్ ఉందని తేలింది.  రక్త పరీక్షలు నిర్వహించగా విషయం తెలిసింది. థైరాయిడ్ మానసికంగానూ ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆరోగ్యంగా కనిస్తున్నా నిస్ర్తాణంగా...చాలా డిస్టబెన్స్ గా అనిపిస్తుంది. వెయిట్ కూడా తగ్గం. థైరాయిడ్ సమయంలో  మార్నింగ్..ఈవెనింగ్ టైమ్ ఫిక్స్ జిమ్ చేసే దాన్ని. కానీ థైరాయిడ్ సమస్య తెలియక ఇబ్బంది పడ్డాను. కాలేజీ రోజుల్లో సన్నగానే ఉండేదాన్ని.  సినిమాల్లోకి వచ్చిన తర్వాతే కాస్త వెయిట్  పెరిగాను అనిపిస్తుంది' అని తెలిపింది.

ఇక కెరీర్ సంగతి చూస్తే   గోపీచంద్ సరసన 'పక్కా కమర్శియల్' చిత్రంలో నటిస్తోంది.  అన్ని పనులు పూర్తిచేసుకున్న సినిమా  జులై 1న రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం  ఆ సినిమా ప్రచార కార్యక్రామాల్లో చురుకుగా పాల్గొంటుంది. అలాగే  అక్కినేని వారసుడు నాగచైత్య సరసన 'థాంక్యూ ' చిత్రంలో నటిస్తోంది.  విక్రమ్. కె. కుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

తెలుగు లో ఈ రెండు మినహా  కోలీవుడ్ లో  ఆరు చిత్రాల్లో  నటిస్తుంది. అలాగే బాలీవుడ్ లో మళ్లీ 'యోధ' సినిమాతో కంబ్యాక్ అవుతుంది. దాదాపు పదేళ్ల తర్వాత అక్కడ రీలాంచ్ అవుతుంది. తొలుత 'మద్రాస్ కేఫ్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. కానీ అక్కడ ఆశించిన విధంగా కెరీర్ బిల్డ్ అవ్వలేదు. దీంతో తెలుగు చిత్రాలపై మనసు పెట్టి సక్సెస్ అయింది.