Begin typing your search above and press return to search.
అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి హీరోలుగా మారిన ఇద్దరు వారసులు..!
By: Tupaki Desk | 15 Jan 2022 2:30 AMటాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది నటీనటులు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసారు. అలానే పలువురు దర్శక నిర్మాతలు కూడా తమ కొడుకులను హీరోలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. వారిలో కొందరు తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని హీరోలుగా రాణిస్తుండగా.. మరికొందరు ఒకటీ రెండు సినిమాలకే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడు సంక్రాంతికి ఇద్దరు వారసులు హీరోలుగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు మరియు ఎంపీ గల్లా జయదేవ్ కొడుకైన అశోక్ ''హీరో'' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ సినిమా విడుదల కానుంది. మరోవైపు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ ను ''రౌడీ బాయ్స్'' చిత్రంతో హీరోగా పరిచయం చేశారు. శుక్రవారం (జనవరి 14) ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. వీరిద్దరూ హీరోలుగా రాణిస్తారా లేదా అనేది పక్కన పెడితే.. సినిమాల్లోకి రావడానికి ముందు బాగానే గ్రౌండ్ వర్క్ చేసి వచ్చారని తెలుస్తోంది.
సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్న అశోక్ గల్లా.. కేవలం వారి సపోర్ట్ తోనే కాకుండా సినిమాల మీద ఆసక్తితో ప్యాషన్ తో చాలా కష్టపడ్డాడని తెలుస్తోంది. సింగపూర్ - అమెరికాల్లో ఫిల్మ్ కోర్సులు చేసిన అశోక్.. కృష్ణ - మహేష్ బాబు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడు. అంతేకాదు 'శ్రీమంతుడు' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేసాడు. ఈ విషయాన్ని దర్శకుడు కొరటాల శివ స్వయంగా వెల్లడించారు.
'శ్రీమంతుడు' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పెట్టుకోమని మహేష్ బాబు చెప్పగా.. ఫారిన్ లో చదువుకున్న అబ్బాయి ఇక్కడ పని చేయగలడా? అని కొరటాల శివ అనుకున్నాడట. అయితే సెట్ లో ఉన్నంత సేపు ఎప్పుడూ ఏదొక పని చేస్తూనే కనిపించేవాడట. అంతేకాదు తమ మేనమామ మహేష్ ఏ షాట్ లో ఎలా నటిస్తున్నాడు.. ఏ సీన్ లో ఎలా ఉన్నాడు అని నోట్ చేసుకుండేవాడట. అయితే అశోక్ ఇదంతా హీరో అవడం కోసమే ప్రిపేర్ చేసుకున్నాడని మహేష్ చెప్పినట్లు కొరటాల తెలిపారు.
మరోవైపు దిల్ రాజు ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆశిష్ కూడా హీరోగా కనిపించడానికి బాగానే కష్టపడ్డారు. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఆశిష్ కఠోర శ్రమ చేసి దాదాపు 25 కేజీల బరువు తగ్గారు. అంతేకాదు పెర్ఫార్మెన్స్ - డ్యాన్స్ - ఎమోషన్స్ - కామెడీ చేయడానికి తనను తాను రెడీ చేసుకున్నాడు. దీని కోసం న్యూయార్క్ - ముంబైలతో పాటు హైదరాబాద్ లో కూడా యాక్టింగ్ కోర్సులు చేసాడు. అలానే హీరో అవ్వడం కంటే ముందు ఆశిష్ రెడ్డి.. ‘కేరింత’ అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు రౌడీ బాయ్స్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు
మొత్తానికి హీరోగా ఎదిగేందుకు అశోక్ గల్లా మరియు ఆశిష్ రెడ్డి చాలా గ్రౌండ్ వర్క్ చేసి.. ఫుల్ గా ప్రిపేర్ అయ్యి వచ్చారని అర్థమవుతోంది. మరి వారి టాలెంట్ తో ప్రేక్షకాదరణ దక్కించుకుని ఇండస్ట్రీలో రాణిస్తారో లేదో చూడాలి.