Begin typing your search above and press return to search.

మూతపడ్డ 2వేల థియేటర్లు.. యూఎస్ లో ఏం జరుగుతుంది..!

By:  Tupaki Desk   |   17 March 2023 12:07 PM GMT
మూతపడ్డ 2వేల థియేటర్లు.. యూఎస్ లో ఏం జరుగుతుంది..!
X
ఇండియన్ సినిమా మార్కెట్ ముఖ్యంగా తెలుగు సినిమా మార్కెట్ యూఎస్ లో ఇయర్ ఇయర్ కి పెరుగుతూ వస్తుంది. అక్కడ బిజినెస్.. కలెక్షన్స్ కూడా తెలుగు సినిమా వసూళ్ల లెక్కల్లో భారీ మార్పులు వస్తున్నాయి. మన స్టార్స్ అంతా కూడా యూఎస్ మార్కెట్ మీద.. అక్కడ ఆడియన్స్ కి ఇష్టపడే కథలను కూడా చేస్తూ వస్తున్నారు. మిలియన్ మార్క్ అనేది టాలీవుడ్ హీరోలకు సరికొత్త టార్గెట్ గా మారింది.

అయితే ఇదంతా కూడా కోవిడ్ రాకముందు మాట. కోవిడ్ కి ముందు యూఎస్ లో తెలుగు సినిమాల మార్కెట్ ఓ రేంజ్ లో ఉంది. అక్కడ మన సినిమాలకు 25 డాలర్ల టికెట్ ప్రైజ్ తో సినిమాలు ఆడించే వారు.

కానీ కోవిడ్ వల్ల పరిస్థితి తలకిందులైంది.. తెలుగు రాష్ట్రాల థియేటర్లే తెరుచుకోవడం కష్టమని అనిపించాయి. కొవిడ్ ఎఫెక్ట్ యూఎస్ లో కూడా భారీగా పడింది. అక్కడ థియేటర్ వ్యవస్థని కూడా లాస్ అయ్యేలా చేసింది. చాలా నెలలుగా యూఎస్ థియేటర్లు మూత పడటం వల్ల భారీ లాసులు వచ్చి థియేటర్లు పూర్తిగా మూత పడే పరిస్థితి వచ్చింది.

అక్కడ ఆడియన్స్ కూడా ఓటీటీలకు అలవాటు పడి థియేటర్ లో సినిమా చూడాలన్న ఆసక్తి కూడా తగ్గించుకున్నారు. కోవిడ్ కి ముందు అంటే 2019లో యూఎస్ లో 42 వేలకు అటు ఇటుగా థియేటర్లు ఉండగా 2022లో 39 వేలకు పడిపోయాయి. దాదాపు 2000 థియేటర్లు మూత పడినట్లు తెలుస్తుంది.

అంతేకాదు అంతకుముందు 25 డాలర్లు ఉన్న టికెట్ రేటు కాస్త 10.5 కి కుదించారు. యూఎస్ లో ఒకప్పుడు కోట్ల కొద్దీ జరిగే స్టార్ సినిమా బిజినెస్ కూడా చాలా తగ్గిపోయింది. అయినా సరే యూఎస్ మార్కెట్ ని వదిలి పెట్టదలచుకోలేదు. మన స్టార్స్. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి కుదుటపడగా యూఎస్ లో కూడా మన సినిమాలకు మంచి రోజులు వస్తాయని చెబుతున్నారు. యూఎస్ లో థియేటర్లు తగ్గినా సరే ఉన్న థియేటర్లలో తెలుగు సినిమాలు ఆడించాలని ఫిక్స్ అయ్యారు.

యూఎస్ లో మన తెలుగు సినిమాల మార్కెట్ ని పెంచే దిశగా స్టార్స్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూఎస్ లో తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కు థియేటర్లు మూతపడటం వారి బిజినెస్ మీద ఎఫెక్ట్ పడేలా చేస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.