ఓటిటి రిలీజుకు సిద్ధమైన తుగ్లక్ దర్బార్..!

Thu Apr 22 2021 11:15:03 GMT+0530 (IST)

Tughlaq Durbar ready for OTT release

పిజ్జా అనే అనువాద చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. దక్షిణ చిత్రపరిశ్రమలో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు హీరోగా మాత్రమే కాకుండా నటుడిగా వేరే సినిమాలలో క్యారెక్టర్స్ చేస్తూ స్టార్ యాక్టర్ ఫేమ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు విజయ్ నుండి చాలా సినిమాలే తెలుగులోకి అనువాదమై వచ్చాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన సేతుపతి ప్రస్తుతం స్టార్ యాక్టర్ గా అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇటీవలే సూపర్ డీలక్స్ 96 మాస్టర్ సినిమాలతో మంచి ఊపులో ఉన్నాడు. అలాగే రీసెంట్ గా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు.ప్రస్తుతం విజయ్ మోస్ట్ బిజీస్ట్ సౌత్ యాక్టర్. తాజాగా విజయ్ నటిస్తున్న 'తుగ్లక్ దర్బార్' సినిమా డిజిటల్ రిలీజ్ కు రెడీ అయింది. థియేట్రికల్ రిలీజ్ కావాల్సింది కానీ కోవిడ్ కారణంగా సినిమాను ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఓటిటి రిలీజ్ కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను లలిత్ కుమార్ నిర్మిస్తుండగా.. ఢిల్లీ ప్రసాద్ దీన్ దయాల్ దర్శకత్వం వహిస్తున్నాడు. పాపులర్ ఓటిటి 'డిస్నీప్లస్ హాట్ స్టార్'లో తుగ్లక్ దర్బార్ రిలీజ్ కాబోతుంది. ఇంకా విడుదల తేదీ ఎప్పుడనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో విజయ్ సరసన అతిథిరావు హైదరి మంజిమ మోహన్ హీరోయిన్లుగా నటించారు. తాజా పోస్టర్ లో విజయ్ ఇంటెన్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది. గోవింద్ వసంత్ సంగీతం అందిస్తున్న ఈ తుగ్లక్ దర్బార్ మరి ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు రానుందో తెలియాల్సి ఉంది.