'టక్ జగదీష్' టీజర్: ఫ్యామిలీ కోసం ఎంతకైనా తెగించే జగదీష్ నాయుడు..!

Tue Feb 23 2021 17:27:20 GMT+0530 (IST)

Tuck Jagadish Teaser

నేచురల్ స్టార్ నాని హీరోగా రీతూ వర్మ - ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ''టక్ జగదీష్''. ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి - హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 23న ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో రేపు నాని పుట్టినరోజు కానుకగా 'టక్ జగదీష్' టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా 'పండగకు వచ్చే సినిమాలు కొన్ని.. పండగలాంటి సినిమాలు కొన్ని' అని నాని పేర్కొన్నాడు.'ఏటి కొక్క పూట ఏడాది పాట.. నాయుడోరి నోట నుంచి వచ్చిందే మాట' అనే బ్యాగ్రౌండ్ సాంగ్ తో ఈ టీజర్ స్టార్ అయింది. నాని నీట్ గా టక్ చేసుకుని కోడిపుంజుని పట్టుకొని కనిపించాడు. టీజర్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ చూపిస్తూనే ఇందులో కావల్సినంత యాక్షన్ కూడా ఉన్నట్లు హింట్ ఇచ్చారు. దీనికి థమన్ అందించిన నేపథ్య సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. ఒక డైలాగ్ కూడా లేకుండా కేవలం పాటతోనే చిత్ర నేపథ్యం ఏంటో చెప్పేశారు. 'నిన్ను చూసి నికరంగా రొమ్ము ఇరుచుకున్నాది' అంటూ జగదీష్ నాయుడు తన కుటుంబం కోసం ఎలాంటి వారినైనా ఎదురిస్తున్నట్లు చూపించారు. మొత్తం మీద నాని బర్త్ డే గిఫ్ట్ గా వచ్చిన ఈ టీజర్ అదరగొడుతోంది.

ఈ చిత్రంలో నాని అన్నగా జగపతిబాబు బాబు.. తండ్రిగా నాజర్ కనిపిస్తున్నారు. డేనియల్ బాలాజీ - ప్రియదర్శి - తిరువీర్ - రోహిణి - ప్రవీణ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. 'నిన్నుకోరి' వంటి సూపర్ బస్టర్ సినిమా తర్వాత నాని - శివ నిర్వాణ కాంబోలో రాబోతున్న 'టక్ జగదీష్' పై మంచి అంచనాలే ఉన్నాయి.