Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్: ఇది చూడ‌గానే ప్రేమలో ప‌డి`పోతారు`!

By:  Tupaki Desk   |   23 Jan 2023 8:19 PM GMT
ట్రైల‌ర్ టాక్: ఇది చూడ‌గానే ప్రేమలో ప‌డి`పోతారు`!
X
ప్రేమలో పడటం చాలా సులభం కానీ ప్రేమ నుండి బయటపడటం చాలా పెద్ద కాంప్లికేష‌న్ కావ‌చ్చు.. కొన్నిసార్లు.. ఇలాంటి అనుభ‌వాలు సినిమా క‌థ‌లా మార‌నూవ‌చ్చు. ద‌ర్శ‌క‌నిర్మాత లవ్ రంజన్ తెర‌కెక్కిస్తున్న తాజా రొమాంటిక్ కామెడీ `తు ఝూతి మైన్ మక్కార్` ఈ త‌ర‌హానే. తాజాగా విడుద‌లైన‌ మొదటి ట్రైలర్ ఆద్యంతం ల‌వ్ రొమాన్స్ ఫ‌న్ ఎలిమెంట్స్ తో ఆక‌ట్టుకుంటోంది. ఇందులో రణబీర్ కపూర్ .. శ్రద్ధా కపూర్ ఒకరితో ఒక‌రు డేటింగ్ వ్య‌వ‌హారాల‌తో వీక్ష‌కుల్ని క‌ట్టి ప‌డేసే మ్యాజిక్ ని క్రియేట్ చేస్తున్నారు.

`తు ఝూతి మైన్ మక్కార్` ట్రైలర్ మోడ్ర‌న్ యూత్ డేటింగ్ వ్య‌వ‌హారాల‌కు సంబంధించిన సినిమా అని క్లారిటీనిచ్చింది. శృంగారం సరదాలు ప‌నికిమాలినవి అనుకుంటే ఎలా.. కొంటెగా లేకపోతే ఏం బాగుంటుందనే నేటిత‌రం న‌మ్మ‌కాలు.. ఒకే ఒక్క కీల‌క‌ మలుపు త‌ర్వాత ఏమ‌య్యాయి? అన్న థీమ్ లైన్ తో ట్రైల‌ర్ ఆద్యంతం రంజింప‌జేసింది..

శృంగార సంబంధాలు ఈ రోజుల్లో చాలా వింత‌గా మారాయి. ఒక స్మార్ట్ గేమ్ ప్లేయ‌ర్ కి స‌రైన‌ ప్రత్యర్థి అయిన అమ్మాయి త‌గిలితే పిచ్చెక్కిపోతుంది. అమ్మాయి వెంట ప‌డే అబ్బాయి క‌థ‌ రోమాంచితంగా మారుతంది. దీనినే మూవీగా తెర‌పై ఆవిష్క‌రించారు. తూ ఝూతి మైన్ మక్కార్ అనేది ప్రేమల యుద్ధం అని నమ్మే యువ‌త‌రం సినిమా. ప్రేమాట‌లు దోబూచులాట‌లు తెర నిండుగా ప‌రిచేసిన సినిమా అని ఈ ట్రైల‌ర్ చెబుతోంది.

ఈ చిత్రంతో రణబీర్ కపూర్- శ్రద్ధా కపూర్ మొదటి సారి జంట‌గా న‌టించారు.. వారు లవ్ రంజన్ ఫిల్మ్ ఫ్రీక్వెన్సీకి సరిపోయే టెంపోతో ఆక‌ట్టుకున్నారు. 3-నిమిషాల నిడివి గల ట్రైలర్ తో కుర్ర‌కారు ప్రేమ‌లో ప‌డిపోవ‌డం ఖాయం. ప్రేమ‌లో ఎన్ని కొంటె ప‌నులు చేసినా కానీ చివ‌రికి ప్రేమ జంట‌ సంబంధం వివాహంతో మాత్రమే పరాకాష్టగా దృశ్యంగా మారుతుంది.

తూ ఝూతి మైన్ మక్కార్ ల‌వ్ ట్రేడ్ మార్క్ ప్రాజెక్ట్ అన‌డంలో సందేహం లేదు. రణబీర్ కపూర్ తన బ్లాక్ బస్టర్ మూవీ `యే జవానీ హై దీవానీ` తర్వాత పదేళ్లకు మ‌ళ్లీ రొమాంటిక్-కామెడీలో న‌టిస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఈ ట్రైల‌ర్ ఆద్యంతం శ్రద్ధా కపూర్ అంద‌చందాలు మ‌తులు చెడ‌గొడుతున్నాయి. మ్యూజికల్ రొమాంటిక్-కామెడీలో డింపుల్ కపాడియా .. బోనీ కపూర్ కూడా నటించారు.

బ్రహ్మాస్త్ర- యే జవానీ హై దీవానీ- ఏ దిల్ హై ముస్కిల్ వంటి చిత్రాలకు చార్ట్ బస్టర్ ఆల్బమ్ లను అందించిన ప్రీతమ్ తాజా చిత్రానికి కూడా సంగీతం అందించారు. అమితాబ్ భట్టాచార్య సాహిత్యం అందించారు. ఈ ఆల్బమ్ లో ఏడు పాటలు ఉంటాయి. వాటిలో రెండు ట్రైలర్ లోను టీజ్ చేసాయి. లవ్ రంజన్ -అంకుర్ గార్గ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. టి-సిరీస్ సమర్పణలో ఈ చిత్రం హోలీ కానుక‌గా మార్చి 8న థియేటర్లలో విడుదల కానుంది.

డిసెంబర్ 2022లో జరిగిన రెడ్ సీ ఫెస్టివల్ సందర్భంగా రణ్ బీర్ కపూర్ తన చివరి రొమాంటిక్ కామెడీలలో `తు ఝూటీ మైన్ మక్కార్` ఒకటని చెప్పాడు. నేను పెద్దవాడినైపోతున్నా. నా వయస్సు పెరుగుతున్నందున నేను చేసే చివరి రొమాంటిక్ కామెడీలలో ఇది ఒకటి అవుతుందనుకుంటున్నాను. ఏమో నాకు తెలియదు! అని న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.