'ఏదైనా సరే రెండు నిమిషాలే ట్రై చేస్తా.. ఆ తర్వాత వదిలేస్తా'

Sun Aug 02 2020 18:00:56 GMT+0530 (IST)

Try anything for two minutes .. then leave

మెగా డాటర్ నిహారిక కొణిదలకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. రెగ్యులర్ గా పోస్ట్స్ పెడుతూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. అభిమానులతో చిట్ చాట్ చేస్తూ.. వారు అడిగే చిలిపి ప్రశ్నలకు సమాధానమిస్తూ.. తన ఫోటోలను షేర్ చేస్తూ.. వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఎప్పుడూ యాక్టివ్ మోడ్ లో ఉంటుంది. ఇక నిహారిక తనకు కాబోయే భర్తను కూడా మొదటగా సోషల్ మీడియా ద్వారానే పరిచయం చేసింది. గుంటూరు పోలీసుశాఖలో విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్ కుమారుడు  చైతన్యతో నిహారిక ఏడడుగులు వేయబోతున్నారు.కాగా నిహారికకి పెళ్లి కుదిరిందని తెలిసినప్పటి నుంచి నిత్యం ఏదో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో ఇటీవల చైతన్య బర్త్ డే సందర్భంగా.. నీ చిరునవ్వు రూమ్ నిండా వెలుగులు నింపుతుంది. ఆ ఒక్క హగ్ సొంత నివాసంలా అనిపిస్తుంది. నువ్వే నా సంతోషానికి చిరునామా చెయ్. ప్రపంచలోనే అత్యుత్తమమైనవన్నీ పొందగలిగే అర్హత ఉన్నవాడివి. హ్యాపీ బర్త్ డే లవ్ అంటూ కాబోయే భర్తపై ప్రేమను కురిపిస్తూ బర్త్ డే విషెస్ తెలిపింది. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేసాయి.

తాజాగా నిహారిక మరో వీడియోను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అందులో నిహారిక తన వాచ్ ని రిపేర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దాన్ని బాగుచేయడానికి ప్రయత్నించి ఫెయిల్ అయినట్లు కనిపిస్తోంది. ఈ విషయాన్ని మెగా డాటర్ వెల్లడిస్తూ.. తనకు ఏ పని అయినా సరే రెండు నిమిషాల వరకు ప్రయత్నించే ఓపిక ఉంటుందని.. ఆ తర్వాత వదిలేస్తానని చెప్తూ వీడియోను పోస్ట్ చేసింది. దీనికి మెగా ఫ్యామిలీ సభ్యులు శ్రీజ - కళ్యాణ్ దేవ్ కూడా స్పందిస్తూ కామెంట్స్ పెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది.