Begin typing your search above and press return to search.

నాని రెమ్యునరేషన్ పై వస్తున్న వార్తల్లో నిజం ఎంత..?

By:  Tupaki Desk   |   25 March 2023 8:00 AM GMT
నాని రెమ్యునరేషన్ పై వస్తున్న వార్తల్లో నిజం ఎంత..?
X
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా రిలీజ్ ప్రమోషన్స్ లో మస్త్ జబర్దస్త్ గా వినిపిస్తున్న పేరు. డైరెక్టర్ అవుదామని అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి అష్టా చెమ్మ సినిమాతో హీరోగా మారిన నాని అప్పటి నుంచి హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈరోజు నేచురల్ స్టార్ నాని దసరాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో నాని తన ఊర మాస్ స్టామినా చూపించాలని ఫిక్స్ అయ్యాడు. కెరీర్ జీరో నుంచి మొదలు పెట్టినా నాని అంటే ఇప్పుడు ఒక మినిమం గ్యారెంటీ హీరో అనేలా క్రేజ్ తెచ్చుకున్నాడు. అతని సినిమాకు పెట్టిన బడ్జెట్ ఈజీగా రికవర్ అవుతుందని చెప్పొచ్చు.

దసరా సినిమా కోసం నాని భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నాడని టాక్. అంతకుముందు 10 నుంచి 12 కోట్ల దాకా ఉన్న నాని రెమ్యునరేషన్ దసరా సినిమాకు 15 కోట్ల దాకా తీసుకున్నాడని టాక్.

ఇక మరోపక్క దసరా తర్వాత సినిమాకు మరోసారి భారీగా రెమ్యూనరేషన్ పెంచేశాడట నాని. ప్రస్తుతం నాని 30వ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. వైరా క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా వస్తుంది. సినిమా కోసం నాని 22 కోట్ల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు టాక్.

నాని సినిమా బడ్జెట్ కూడా పాతిక కోట్లు అటు ఇటుగా ఉంటుంది. సో సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా సరే సేఫ్ ప్రాజెక్ట్ అయినట్టే. అదీగాక శాటిలైట్, డిజిటల్ రైట్స్ తో కూడా నాని సినిమాలు మంచి రేటు అందుకుంటున్నాయి.

అందుకే నాని రెమ్యునరేషన్ పెంచినా నిర్మాతలకు ఓకే అంటున్నారు. దసరాతో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్న నాని అది వర్క్ అవుట్ అయితే మాత్రం ఇక మీదట నాని కూడా తన ప్రతి సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తారని చెప్పొచ్చు.

నాని 30వ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుంది. నాని నెక్స్ట్ సినిమాల లైనప్ కూడా క్రేజీగా ఉంది. తప్పకుండా నాని ఇప్పుడున్న రేంజ్ కన్నా అతి తక్కువ టైం లో మరో రేంజ్ కి వెళ్తాడని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.