పీకె - సుజీత్ మూవీపై ట్రోల్స్ షురూ!

Tue Dec 06 2022 13:02:25 GMT+0530 (India Standard Time)

Trolls On Pawankalayan - Sujeeth New Movie Poster

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఊహించని విధంగా `సాహో`తో డిజాస్టర్ ని సొంతం చేసుకున్న సుజీత్ కు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. సుజీత్ డైరెక్షన్ లో డీవీవీ దానయ్య నిర్మాతగా పవన్ హీరో గా తెరపైకి రానున్న మూవీని ఆదివారం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన పోస్టర్ ని కూడా విడుదల చేశారు. They Call Him #OG అంటూ క్యాప్షన్ ఇచ్చారు. పోస్టర్ లో పలు ఆసక్తికరమైన అంశాలు దాగి వుండటంతో చాలా మంది దీన్ని డీకోడ్ చేయడం మొదలు పెట్టారు.They Call Him #OG ఇక్కడ ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని. సినిమాలో పవన్ ని అంతా ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని పిలుస్తారని ఇందులో పవన్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడని క్యాప్షన్ ని బట్టి తెలుస్తోంది. పోస్టర్ లో పవన్ కల్యాణ్ అటు వైపు చూస్తూ నిలబడి వుండగా అతనిపై జపనీస్ భాషలో రాసివున్న అక్షరాలు కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది. FirestormisComming (అగ్నితుఫాన్ వచ్చేస్తోంది) అనే అక్షరాలు సినిమాలో పవన్ కల్యాణ్ క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ గా వుండనుందో స్పష్టం చేస్తున్నాయి.

పోస్టర్ లో వున్న దాదాపు 6 పాయింట్లని డీకోడ్ చేసిన వారంతా సినిమా ఓ రేంజ్ లో వుండేలా వుందని కామెంట్ లు చేయడం మొదలు పెట్టారు. అంతా బాగానే వుంది కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేది ఎప్పుడు.. షూటింగ్ పూర్తి చేసుకునేది ఎన్నడు.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఏ టైమ్ లో అనేది మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. పవన్ కున్న పొలిటిక్ బిజీ షెడ్యూల్ వల్ల ఇప్పటికే పలు సినిమాల షూటింగ్ లు ఆగిపోవడం.. `హరి హర వీరమల్లు` షూటింగ్ నెలలు గడుస్తున్నా నత్తనడకన సాగుతుండటం తెలిసిందే.

అంగీకరించినవే పూర్తి చేయని పవన్ ..  సుజీత్ ప్రాజెక్ట్ ని ప్రకటించడంతో పలువురు నెటిజన్ లు అభిమానులు ఈ ప్రాజెక్ట్ పై సెటైర్లు వేస్తూ నెట్టింట ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. 2024 ఎన్నికల్లో జనసేన అన్ని నియోజక వర్గాల్లో పోటీ చేయాలనుకుంటోంది. ఇందు కోసం పవన్ ప్రణాళికని కూడా సిద్ధం చేశాడు.
ఇందు కోసం భారీ స్థాయిలో ఎన్నికల ప్రచారానికి పవన్ బయలుదేరబోతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రకటించిన సెట్స్ పై వున్న సినిమాలని ఎన్నిటి పూర్తి చేస్తాడు? అన్నదే ఇప్పడు ప్రతీ ఒక్కరి మదిని తొలిచేస్తోంది.

దీంతో పొలిటికల్ ప్రెషర్ లో వున్న పవన్ సుజీత్ ప్రాజెక్ట్ ని ఎప్పటికి పట్టాలెక్కిస్తాడు.. ఎప్పటికీ షూటింగ్ పూర్తి చేస్తాడు?.. ఎప్పుడు రిలీజ్ చేస్తాడని అంతా నెట్టింట ట్రోల్ చేయడం మొదలు పెట్టారని ఇన్ సైడ్ టాక్.