Begin typing your search above and press return to search.

నిర్మాత కాళ్లు పట్టుకున్న త్రివిక్రమ్.. కారణం ఇదే!

By:  Tupaki Desk   |   13 Jan 2021 5:25 AM GMT
నిర్మాత కాళ్లు పట్టుకున్న త్రివిక్రమ్.. కారణం ఇదే!
X
‘త్రివిక్రమ్ శ్రీనివాస్..’ తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్రదర్శకుల జాబితాలో ఉన్నారు. రచన ఆయన అడిషనల్ వెపన్. మాటల మాంత్రికుడనే బిరుదు సొంతం చేసుకున్న త్రివిక్రమ్.. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్లోనూ తనదైన వాక్చాతుర్యంతో అందరినీ మెస్మరైజ్ చేస్తుంటారు.

హీరో రామ్ నటించిన మాస్ అండ్ క్లాస్ మూవీ రెడ్. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. సంక్రాంతి సందర్భంగా 14న విడుదల కానుంది. మాల్వికా శర్మా, అమ్రితా అయ్యర్‌లు హీరోయిన్లు. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నివేథా పేతురాజ్ కనిపించింది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈ వెంట్‌ మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన సినీ కెరీర్ ను, మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు.

‘ఈ సినిమా నిర్మాత రవికిషోర్ గురించి మాట్లాడకుండా వెళ్లకూడదు’ అంటూ మొదలు పెట్టిన త్రివిక్రమ్ నాటి పరిస్థితులను వివరించారు.. ‘నాకు స్వయంవరం సినిమా తర్వాత ఎవరూ సినిమా ఇవ్వడంలేదు. ఆ సమయంలో నేను నా సొంతూరు భీమవరం వెళ్లిపోయాను. అప్పుడు రవికిషోర్ నాకు ఫోన్ చేసి పిలిపించి, నువ్వే కావాలి సినిమా కథ రాయించారు’ అని చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్.

‘నువ్వు నాకు నచ్చావ్ కథ రాసేటప్పుడు ఆ ఫైల్ తన వద్దనే ఉంచుకొని అర్థరాత్రి నాకు ఫోన్ చేసి ఇందులో ఈ డైలాగ్ ఎంతో బాగుందంటూ నాకు చెప్పేవారు. నేను రాసిన కథ మొత్తం చదివేవారు. ఇటువంటి ఆయనకు నాలుగు సినిమాలు రాసే అదృష్టం దక్కింది. ఆయన గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే’ అన్నారు.

రవికిషోర్ తో కలిసి పనిచేయడం చాలా గొప్ప అనుభవం అన్న త్రివిక్రమ్.. తాను ఎంత గొప్ప దర్శకుడిని అయినా రవి కిషోర్‌కి రుణపడి ఉంటానని ఆయన కాళ్లు పట్టుకున్నారు. ఈ దృశ్యం చూసిన అందరూ చప్పట్లతో అభినందించారు.