Begin typing your search above and press return to search.

త్రివిక్ర‌మ్ తో ఎన్టీఆర్.. మ‌ళ్లీ క‌లుస్తున్నారా?

By:  Tupaki Desk   |   29 Nov 2022 4:09 AM GMT
త్రివిక్ర‌మ్ తో ఎన్టీఆర్.. మ‌ళ్లీ క‌లుస్తున్నారా?
X
టాలీవుడ్ లో స్టార్ హీరోల క్రేజీ ప్రాజెక్ట్ ల ప‌రిస్థితి అనుకున్న‌ది ఒక్క‌టి అయ్యింది మ‌రొక‌టి అన్న‌ట్టుగా మారుతోంది. ఇక హీరోతో అనుకున్న ప్రాజెక్ట్ క‌ట్‌ చేస్తే.. మ‌రో హీరోకు వెళుతోంది. దీంతో ముందు అనుకున్న హీరోకు.. ద‌ర్శ‌కుడికి మ‌ధ్య ఏదో జ‌రిగింది.. అందుకే అనుకున్న ప్రాజెక్ట్ చేతులు మారిందంటూ ప్ర‌చారం జ‌ర‌గ‌డం స‌ర్వ‌సాధార‌ణంగా మారింది.ఈ ప్ర‌చారానికి త‌గ్గ‌ట్టే హీరోలు, ద‌ర్శ‌కులు కూడా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో మళ్లీ వీళ్లు క‌లిసి ప‌ని చేస్తారా? అనే అనుమానం అం్ద‌రిలోనూ క‌లుగుతోంది. అయితే ఇక్క‌డ శాశ్వ‌త శ‌త్రువులు.. శాశ్వ‌త మిత్రులు అంటూ వుండ‌రు.

స‌మ‌యాన్ని.. సంద‌ర్భాన్ని బ‌ట్టి క‌లిసిపోతుంటారంతే. స్టార్ హీరోలు.. డైరెక్ట‌ర్లు కూడా అంతే.. ఒక్క హిట్టు ప‌డ‌గానే జాత‌కాలు, స‌మీక‌ర‌ణాలు మారిపోయే ఇండ‌స్ట్రీ ఇది. అందుకే ఎవ‌రు ఎప్పుడు ఎలా క‌లుస్తారో.. ఎందుకు విడిపోయి దూరంగా వుంటారో చెప్ప‌డం క‌ష్టం. ఇదిలా వుంటే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌.. ఎన్టీఆర్ మ‌ళ్లీ క‌ల‌వాల‌నుకుంటున్నారా? .. ఇద్ద‌రు క‌లిసి సినిమా చేయాల‌నుకుంటున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.

కొన్ని నెల‌ల క్రితం త్రివిక్ర‌మ్ - ఎన్టీఆర్ క‌లిసి ఓ భారీ సినిమా చేయాల‌నుకున్నారు. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో యువ సుధా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై సుధాక‌ర్ మిక్కిలినేని ఈ మూవీని నిర్మించాల‌ని ప్లాన్ చేశారు. అధికారికంగా ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. ఇక అఫీషియ‌ల్ లాంచింగ్‌.. రెగ్యుల‌ర్ షూటింగ్ పై అప్ డేట్ రావాలి.. ఎన్టీఆర్ 'RRR' ని పూర్తి చేసి బ‌య‌టికి రావ‌డ‌మే ఆల‌స్యం ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌డ‌మే అనుకున్నారంతా కానీ క‌ట్ చేస్తే.. సీన్ మారింది.

ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇంత ఆర్భాటం చేసిన ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఆగింద‌ని చ‌ర్చ జ‌రిగింది. ఇద్ద‌రి మ‌ధ్ మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగానే ఈ ప్రాజెక్ట్ ఆగింద‌ని, దీంతో ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెరిగిందనే ప్ర‌చారం జ‌రిగింది. ఆత‌రువాత ఎన్టీఆర్ ..కొర‌టాల శివ‌తో సినిమా అనౌన్స్ చేయ‌డం.. త్రివిక్ర‌మ్ - మ‌హేష్ తో వెళ్ల‌డం తెలిసిందే. అయితే తాజాగా మ‌ళ్లీ ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ క‌లిసి ప‌ని చేయాల‌నుకుంటున్నార‌ట‌. గ‌త కొంత కాలంగా త‌న‌కు దూరంగా వుంటున్న ఓ బ‌డా నిర్మాత ఎన్టీఆర్ తో సినిమా చేయాల‌ని రీసెంట్ గా క‌లిశార‌ట‌.

వెంట‌నే ఎన్టీఆర్ స‌ద‌రు ప్రొడ్యూస‌ర్ తో త్రివిక్ర‌మ్ తో చేద్దాం.. వెళ్లి క‌ల‌వ‌మ‌న్నాడ‌ట‌. త‌ను చెప్పింది విని ముందు షాక్ అయిన స‌ద‌రు నిర్మాత ఎన్టీఆర్ చెప్పిన‌ట్టే వెళ్లి త్రివిక్ర‌మ్ ని క‌లిసి విష‌యం చెప్పార‌ట‌. అంతా విన్న త్రివిక్ర‌మ్ దాంతేముంది చేద్దాం అని చెప్పార‌ట‌.

ఎంటైర్ ఎపిసోడ్ ని బ‌ట్టి చూస్తుంటే త్రివిక్ర‌మ్ తో క‌లిసి వ‌ర్క్ చేయాల‌ని ఎన్టీఆర్ అనుకుంటున్నాడ‌ని తెలుస్తోంది. మ‌రి అది మ‌హేష్ సినిమా త‌రువాతే అవుతుందా?.. లేక మాట‌ల వ‌ర‌కేనా? అన్న‌ది వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.