మహేష్.. బన్నీ కలిసి ఇంటర్వ్యూ..!

Wed Nov 20 2019 17:05:59 GMT+0530 (IST)

Trivikram To Unite Mahesh And Allu Arjun

సూపర్ స్టార్ మహేష్ బాబు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల సినిమాలు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం మరియు అల్లు అర్జున్ 'అల వైకుంఠాపురంలో' సినిమాలు ఒకే రోజున విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇద్దరు హీరోల మద్య హోరా హోరీ ఫైట్ తప్పేలా లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరిని వెనక్కు తగ్గమన్నా.. పోటీ నుండి తప్పుకోమన్నా కూడా నో అంటే నో అంటున్నారట. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండు సినిమాలు ఢీ కొట్టబోతున్నాయి.ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నా కూడా ప్రమోషన్ సమయంలో ఇద్దరిని ఒక్క చోటుకు చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక మహేష్ బాబుకు మంచి ఆప్త మిత్రుడు త్రివిక్రమ్. ఇద్దరి మద్య మంచి ర్యాపో ఉంటుంది. అందుకే ఈ ఇద్దరు హీరోలను ఒప్పించి సంక్రాంతికి ఒక ఇంటర్వ్యూను ప్లాన్ చేయాలని దర్శకుడు త్రివిక్రమ్ భావిస్తున్నాడట.

అల వైకుంఠపురంలో సినిమా ప్రమోషన్ కోసం బన్నీ ఓకే చెప్పడం కన్ఫర్మ్. మహేష్ బాబుతో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రమోషన్స్ లో బిజీగా ఉంటే చెప్పలేం కాని త్రివిక్రమ్ కు దాదాపుగా మహేష్ బాబు కూడా ఓకే చెప్తాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక వేళ బన్నీ మహేష్ బాబులు బుల్లి తెరపై కలిసి కనిపిస్తే ప్రేక్షకులు ఫుల్ ఖుషీ అవ్వడం కన్ఫర్మ్. రెండు సినిమాలు ఒకే రోజు రావడం.. ఆ రెండు సినిమాల హీరోలు ఒకే ఇంటర్వ్యూలో కనిపించడం అనేది చాలా అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇది కనుక వర్కౌట్ అయితే రెండు సినిమాలకు కూడా మంచి పబ్లిసిటీ ఖాయం.