Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ను ఈసారి త్రివిక్రమ్ గట్టిగా వాడేస్తాడట!

By:  Tupaki Desk   |   5 April 2020 10:30 AM GMT
ఎన్టీఆర్ ను ఈసారి త్రివిక్రమ్ గట్టిగా వాడేస్తాడట!
X
త్రివిక్రమ్ అంటే.. కామెడీ, సెన్స్ ఆఫ్ హ్యుమర్ పంచ్ లు.. ఆహ్లాదకరంగా ఆయన సినిమాలుంటాయని పేరు.. ఓ మొక్కకు అంటుకట్టినట్టు.. ఓ గోడకట్టినట్టుగా సినిమాలను మలుస్తాడు. సాధారణ కథలనే మనసులకు హత్తుకునేలా హెల్దీ కామెడీతో చెబుతుంటాడు.

అయితే ‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్ తర్వాత తన సహజశైలికి భిన్నంగా రాయలసీమ ఫ్యాక్షన్ కథను తీసుకొని సీరియస్ కథను వండివార్చాడు. ఆ సినిమా హిట్ అయినా ఏదో వెలితి. యాక్టింగ్ ఇరగదీసే ఎన్టీఆర్ తో కామెడీని త్రివిక్రమ్ పండించలేదన్న బాధ ఫ్యాన్స్ లో ఉంది.

ఇప్పుడు ఆ కరువు తీర్చేలా త్రివిక్రమ్ సరికొత్త కథ రెడీ చేస్తున్నారట.. ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే ప్రచారంలో ఉన్న సినిమాలో ఫుల్ లెంత్ కామెడీని ఎన్టీఆర్ తో పండించడానికి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట..

అసలే ఎన్టీఆర్.. మంచి కథ, కథనం దొరికితే ఇరక్కొట్టేస్తాడు. పైగా మాటల మాంత్రికుడు.. ఇటీవలే సంక్రాంతిని షేక్ చేసిన ‘అల వైకుంఠపురంలో’ లా కామెడీ ట్రాక్ పడితే మాత్రం బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం. మరి వీరిద్దరూ కలిసే తీయబోయే సినిమా ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఇప్పుడు ఫ్యాన్స్ లో చర్చనీయాంశమవుతోంది.