Begin typing your search above and press return to search.

వెంకీ-నానిని కలపనున్న గురూజీ?

By:  Tupaki Desk   |   25 May 2020 5:45 AM GMT
వెంకీ-నానిని కలపనున్న గురూజీ?
X
'అల వైకుంఠపురములో' ఘన విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. నెక్స్ట్ సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఫిక్స్ కూడా అయింది.. ప్రకటన కూడా వచ్చేసింది. ఎన్టీఆర్ ప్రస్తుతం 'RRR' తో బిజీగా ఉన్నారు. 'RRR' పూర్తి కాగానే త్రివిక్రమ్ ప్రాజెక్టు మొదలుపెడతారని అనుకున్నప్పటికీ అది వెంటనే జరిగేలాలేదు. ఎందుకంటే 'RRR' షూటింగ్ డిలే కావడంతో ఎన్టీఆర్ కోసం గురూజీ వేచి చూడక తప్పదు.

దీంతో ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ మరో సినిమా చేస్తారని.. వెంకటేష్ తో ఒక కమిట్మెంట్ ఉందని ఆ సినిమాను ఈ గ్యాప్ లో పూర్తి చేస్తారని గతంలోనే వార్తలు వచ్చాయి కానీ ఆ విషయంపై క్లారిటీ మాత్రం రాలేదు. అయితే ఇప్పుడు మరోసారి అదే వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. వెంకటేష్ - నాని కాంబినేషన్లో ఓ సూపర్ ఎంటర్టైనర్ తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమా కథపై త్రివిక్రమ్ తన టీమ్ తో కలిసి కసరత్తులు చేస్తున్నారట. ఎన్టీఆర్ సినిమా ప్రారంభించేలోపు ఈ సినిమాను పూర్తి చేసే ఆలోచనతో ఉన్నారట.

వెంకీ - నాని ఇద్దరూ సహజ నటులు.. ఇక ఇద్దరి కామెడీ టైమింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇద్దరి కాంబినేషన్ కు త్రివిక్రమ్ పెన్ పవర్ తోడైతే ఆ సినిమా దుమ్ము దులపడం ఖాయమే. అయితే ఈ ప్రాజెక్టు నిజంగా పట్టాలెక్కుతుందా లేదా ఓ రూమర్ లాగే మిగిలిపోతుందా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడకతప్పదు.