తల గాల్లోకి లేచే సీన్.. గుట్టు లీక్ చేశాడే!

Tue Oct 08 2019 19:42:17 GMT+0530 (IST)

Trivikram Interview with Megastar Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి నటించిన `సైరా నరసింహారెడ్డి` చిత్రానికి ప్రముఖుల ప్రశంసలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. వెంకీ ముద్దు.. నాగ్ కౌగిలింత.. రజనీ పొగడ్త! ఒకటేమిటి ఇలాంటి చాలా విషయాల్ని తాజాగా మెగాస్టార్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేసిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రాబట్టారు. అలాగే సైరాలోని ప్రతి సన్నివేశం గురించి .. ప్రతి పాత్రధారి గురించి త్రివిక్రముడు ఎంతో డీటెయిలింగ్ గా చిరును ప్రశ్నించడం వాటికి మెగాస్టార్ స్పష్టంగా వివరణ ఇవ్వడం అంతా ఇంటర్వ్యూలో హైలైట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్వ్యూ ఫ్యాన్స్ లో జోరుగా వైరల్ అవుతోంది.విక్టరీ వెంకటేష్ సినిమా చూశాక వచ్చి తనని ముద్దాడేసి.. పొగడ్తల వర్షంలో ముంచేశారని చిరు తెలిపారు. అలాగే కింగ్ నాగార్జున అయితే చిరుతో పాటే కలిసి సినిమా చూశారట. వెంటనే తనని కౌగిలించుకుని ఆ ఎమోషన్ లో అసలు మాట్లాడలేకపోయారట. ఏమనాలో తెలియలేదు ఆ క్షణం. అంత ఉద్వేగంలో ఉండిపోయారు. నాగార్జున కళ్లు ఎర్రబడిపోయాయని చిరు తెలిపారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళంలో సైరా చిత్రం చూసి వెంటనే ఫోన్ చేసి పొగడ్తల్లో ముంచెత్తారట. కేవలం రజనీ మాత్రమే కాదు.. ఆయన సతీమణి కూడా తనతో ఫోన్ లో మాట్లాడి అద్భుతంగా నటించారని ప్రశంసించారట.

ఇక ఈ చిత్రంలో నయన్ - తమన్నా నటనను త్రివిక్రమ్ పొగిడేశారు. ప్రతి పాత్రను అద్భుతంగా మలిచారని.. అసలు తమన్నాను సెకండాఫ్ లో రివీల్ చేసిన తీరు.. ఆ పాట మైమరిపించాయని .. సురేందర్ రెడ్డి పనితనాన్ని త్రివిక్రముడు ఈ ఇంటర్వ్యూలో కొనియాడారు. అలాగే సినిమా క్లైమాక్స్ లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తల గాల్లోకి ఎగిరేప్పుడు చేతిలోని కత్తి స్పాంటేనియస్ గా ఇద్దరు ఆంగ్లేయులను పొడిచేస్తుంది. ఆ సన్నివేశం జస్టిఫికేషన్ పై మెగాస్టార్ తొలుత తటపటాయించారని.. కానీ ఆ సీన్ ని ఆడియెన్ కన్వే అయ్యేలా తెరకెక్కించడంలో టైమింగ్ అద్భుతంగా కుదిరిందని మెగాస్టార్ టీమ్ ని త్రివిక్రమ్ పొగిడేశారు. ఈ సీన్ ని తీసిన విధానం.. టైమింగ్ ని మెయింటెయిన్ చేసిన వైనం కట్టి పడేశాయని ప్రశంసించారు. ఇంకా ఈ ఇంటర్వ్యూలో చాలా చాలా సంగతులే చిరు-చరణ్-త్రివిక్రమ్ మధ్య దొర్లాయి. ఇక ఈ ఇంటర్వ్యూ చేయాల్సిందిగా.. త్రివిక్రమ్ ని నిర్మాత చరణ్ స్వయంగా రెక్వస్ట్ చేశారట.