Begin typing your search above and press return to search.

ఆ కోరిక తీర్చుకుంటున్న గురూజీ

By:  Tupaki Desk   |   2 Jun 2023 11:07 AM GMT
ఆ కోరిక తీర్చుకుంటున్న గురూజీ
X
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్... తన సినిమాలతో తనకంటూ ఓ మార్క్ ఏర్పచుకున్న సంగతి తెలిసిందే. ఆయన్ని సినీ ఇండస్ట్రీలో అందరూ మాటల మాంత్రికుడిగా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన సినిమాల్లో రాసే పదాలు, మాటలు... ప్రతి ఒక్కరికి మనసును తాకేలా ఉంటాయన్న సంగతి తెలిసిందే.

అయితే ఆయన రచయితగా కెరియర్ ప్రారంభించి.. ఆ తర్వాత దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఇప్పుడు మరోసారి లిరిక్ రైటర్ అవతారం ఎత్తబోతున్నారు. ఇది ఆయనకు కొత్తేం కాదు... స్టార్డం రాకముందు లిరిక్ రైటర్ గా ఓ సినిమాకు పని చేశాడు. కానీ ఆ సినిమా అంతగా హిట్ కాలేదు. అది ఏ సినిమానో కాదు... మాస్ మహారాజ్ రవితేజ సినిమా. 2003లో రవితేజ, నమిత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ఒక రాజు ఒక రాణి.

ఇక ఈ సినిమాకు యోగి దర్శకత్వం వహించారు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు పాటలు అందించాడు. అయితే ఈ సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన పాటలకు మంచి ఆదరణ కూడా లభించింది. ఆయన మాటలు మాదిరిగానే ఈ పాటలు కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తర్వాత కూడా ఆయనకు పాటలు రాసే అవకాశం వచ్చిందని తెలుస్తుంది.

కానీ ఈ సినిమా తర్వాత మరే సినిమాకి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ పాటలు అందించలేదు. ఆ తర్వాత పూర్తిగా ఆయన తన ఫోకస్ మొత్తం దర్శకత్వం పైన అలాగే కథ రచన పైన మాత్రమే పెట్టారు. అయితే అలా మొదలు పెట్టిన ఆయన... ఇప్పుడు స్టార్ డం వచ్చింది. దీనితో ఏం చేసినా జనాలు చూస్తారన్న ధైర్యంతో ప్రయోగం చేస్తున్నాడని తెలుస్తోంది.

మహేశ్ త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న ఎస్ఎస్ఎంబీ 28... గుంటూరు కారం సినిమాలో బిట్ సాంగ్ రాసింది గురూజీనే అని తెలుస్తోంది. ఇప్పటికే విడుదల అయిన టీజర్ అయితే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇక గత ఏడాది భీమ్లా నాయక్ లో లాలా అడవి పులి వచ్చింది కూడా ఈ కలం నుంచే. అయితే త్రివిక్రమ్ మాటలు కాదే.. పాటలు సైతం అలరిస్తాయని మరోసారి రుజువైంది. మొత్తానికి గురూజీ 2 దశాబ్దాల తర్వాత తన కోరికను తీర్చుకుంటున్నాడు.