ఒకప్పుడు కాలక్షేపం కోసం ఉపయోగించే డిజిటల్ ప్లాట్ ఫాములు.. ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ డిజిటల్ ప్లాట్ ఫాములు లేకపోతే ఏమైపోతారో అన్నట్లుగా తయారయ్యాయి. ఓటిటిల అవసరం.. ఉపయోగం అలా పెరిగింది. సినీ ఇండస్ట్రీ మూతపడటం వలన ఓటిటిలే జనాలకు పెద్ద దిక్కులా మారాయి. అయితే ఇప్పుడు థియేటర్లు మూసేయడంతో సినీ ప్రేమికులు అందరూ డిజిటల్ ప్లాట్ ఫామ్ లకు అలవాటు పడిపోయారు. ఇక చిన్న నిర్మాతల నుంచి పెద్ద నిర్మాతల వరకు అందరూ డిజిటల్ స్ట్రీమింగ్ ఛానల్స్ లో తమ సినిమాలు రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
థియేటర్లో వచ్చే మజా ఓటీటీలో రాదని కొంతమంది
అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నవారే మరుసటి రోజు అదే మాట మీద నిలబడే
పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఓటీటీ తప్ప మరో
ప్రత్యామ్నాయం సినిమా వాళ్లకు లేదనిపిస్తుంది. ఈ క్రమంలో ఇక సినిమాలలో
నటించే స్టార్ హీరోయిన్లు.. సీనియర్ ముద్దుగుమ్మలు అందరూ కూడా ఓటీటీలో వెబ్
సిరీస్ ల బాటపడుతున్నారు. భవిష్యత్తులో ఓటిటిలకు మంచి డిమాండ్ ఉండటంతో
ఇప్పటి నుంచే హీరోయిన్లుగా తమ స్థానాలను కన్ఫర్మ్ అయ్యేలా ప్లాన్
చేసుకుంటున్నారు. అందులో భాగంగానే డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కే వెబ్
సిరీస్ లలో నటించడానికి ఒకే చెబుతున్నారు.
ఇప్పటికే కాజల్.. సమంత..
తమన్నా.. వంటి బిజీ తారలు సైతం వెబ్ సీరీస్ లో నటిస్తున్నారు. ఈ క్రమంలో
ప్రముఖ నటి త్రిష కూడా వెబ్ సీరీస్ పట్ల ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
తాజాగా ఓ వెబ్ సీరీస్ లో నటించడానికి ఆమె కమిట్ అయినట్టు తెలుస్తోంది. తమిళ
ఆనంద్ వికటన్ సంస్థ నిర్మిస్తున్న ఈ వెబ్ సీరీస్ కి రామ సుబ్రహ్మణ్యన్
దర్శకత్వం వహించనున్నారు. తండ్రీ కూతుళ్ల మధ్య నడిచే కథతో భావోద్వేగాల
సమ్మిళితంగా ఇది రూపొందనుందని తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో త్రిష తండ్రి
పాత్రలో మరో స్టార్ యాక్టర్ కనిపిస్తాడట. చూడాలి మరి అమ్మడి వెబ్ సిరీస్
లైఫ్ ఎలా ఉండబోతుందో..!