Begin typing your search above and press return to search.

వామ్మో.. ఈ స్పీడ్ ఏంటి త్రిషా?

By:  Tupaki Desk   |   29 May 2023 9:59 AM GMT
వామ్మో.. ఈ స్పీడ్ ఏంటి త్రిషా?
X
సౌత్ ఇండియాలో సుదీర్ఘకాలం పాటు స్టార్ హీరోయిన్ గా ఎదురులేకుండా దూసుకుపోయిన అందాల భామ త్రిష. ఈ అమ్మడు ఏకంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి స్టార్ హీరోయిన్ వరకు త్రిష కెరియర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. అయితే పొన్నియన్ సెల్వన్ కి ముందు ఆమె హీరోయిన్ చాప్టర్ క్లోజ్ అయినట్లే అందరూ భావించారు.

అయితే అనూహ్యంగా పొన్నియన్ సెల్వన్ సిరీస్ లో అందరికంటే ఎక్కువగా పేరొచ్చింది మాత్రం త్రిషకి అని చెప్పాలి. ఆ సినిమాలో ఐశ్వర్యారాయ్ ని సైతం అందం, అభినయంలో త్రిష డామినేట్ చేసింది. మణిరత్నం మ్యాజిక్ పనిచేయడంతో మరల త్రిషకి అవకాశాలు క్యూ కట్టాయి. అంది కూడా స్టార్ హీరోల చిత్రాలలోనే.

పొన్నియన్ సెల్వన్ 2 రిలీజ్ కాకుండానే లోకేష్ కనగరాజ్, విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న లియో సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. ఈ మూవీ షూటింగ్ లో ఉండగానే అజిత్ నెక్స్ట్ సినిమాలో కూడా హీరోయిన్ గ త్రిష కన్ఫర్మ్ అయ్యింది. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇప్పుడు మరో క్రేజీ ఛాన్స్ ని త్రిష సొంతం చేసుకుంది. మణిరత్నం నెక్స్ట్ కమల్ హాసన్ తో మూవీ చేయబోతున్నారు. మరల మూడు దశాబ్దాల తర్వాత మణిరత్నం, కమల్ కలయికలో సినిమా వస్తోంది. ఈ సినిమా కోసం మణిరత్నం త్రిషని హీరోయిన్ గా ఖరారు చేసారని తెలుస్తోంది. పొన్నియన్ సెల్వన్ సిరీస్ లో ఆమె నటనకి ఫిదా అయిపోయి నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం త్రిషని కన్ఫర్మ్ చేసారంట.

ఇలా కోలీవుడ్ లో టాప్ స్టార్స్ అందరూ కూడా తమ సినిమాలలో ఫస్ట్ ఛాయస్ గా త్రిషని తీసుకోవడనికే ఇష్టపడుతున్నారు. ఇప్పుడు నయనతార డిమాండ్ తగ్గిందనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే మలయాళంలో మోహన్ లాల్ కి జోడీగా త్రిష ఒక మూవీలో నటిస్తూ ఉంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.