ట్రెండీ టాక్: ఫేక్ ప్రచారంతో సెలబ్రిటీలకు రక్త కన్నీరు!

Sat Mar 18 2023 09:28:33 GMT+0530 (India Standard Time)

Trendy Talk Social Media Fake News on Celebrities

సోషల్ మీడియాల్లో రకరకాల పుకార్లు సెలబ్రిటీలను విసిగించడం నిత్యం చూస్తున్నదే. ప్రముఖులపై తప్పుడు ప్రచారం సాగిపోతుంటే దానిని ఖండించేందుకు కూడా ఎవరూ ఆసక్తిని కనబరచడం లేదు. ఈ పుకార్లకు అంతూ దరీ లేదు. నాగచైతన్య-సమంత రూత్ ప్రభు బ్రేకప్ వ్యవహారం సహా రష్మిక మందన్న-రక్షిత్ శెట్టి ప్రేమ వివాహ వైఫల్యం గురించి.. దిశా పటానీ- టైగర్ ష్రాఫ్ జంట విడిపోవడం గురించి ప్రజలు విస్త్రతంగా చర్చించారు. ఇటీవల కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా డేటింగ్ పెళ్లి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అయితే సదరు జంటలు సహా చాలా మంది సినీప్రముఖులు 'ఫేక్' ట్వీట్ లకు సాఫ్ట్ టార్గెట్ గా మారారని పలువురు సినీప్రముఖులు చెబుతున్నారు.



 ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ లో సభ్యురాలిగా చెప్పుకునే ఒక ట్విట్టర్ యూజర్ కియారా అద్వానీని ఒక నెల గర్భవతి అని వెల్లడించడం నెటిజనుల్లో డిబేట్ గా మారింది. మరో ట్వీట్ లో అక్షయ్ కుమార్ విదేశీ షూటింగ్ లో ఉన్నప్పుడు దిశా పటానీని వేధించాడని ఆరోపించాడు. అయితే సదరు నెటిజనుడి ట్వీట్ పై అక్షయ్ కానీ దిశా పటానీ కానీ స్పందించలేదు. అయితే ఈ తప్పుడు ఆరోపణలపై అక్షయ్ - దిశా అభిమానులు చాలా కలతకు గురవ్వడం సోషల్ మీడియాల్లో కనిపించింది.

ఇదే ట్విట్టర్ హ్యాండిల్ (ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ లో సభ్యురాలు) ఇలాంటి 'ఫేక్ న్యూస్'లను వైరల్ చేయడంలో చాలా పాపులరైంది. విజయ్ దేవరకొండ సమంత రూత్ ప్రభుతో 'టైమ్ పాస్ ప్రేమాయణం సాగిస్తున్నాడని కూడా సదరు ట్వీట్ అభిమానుల్లో చర్చకు తెర తీసింది. రష్మిక మందన్న తో ప్రేమాయణంలో విసుగు చెందిన దేవరకొండ తన నుంచి విడిపోయాడని కూడా సదరు ట్విట్టర్ హ్యాండిల్ లో ఆరోపించారు. అంతేకాదు.. సమంతా రూత్ ప్రభుని నాగచైతన్య ఇబ్బందులకు గురి చేసాడని ఇదే ట్విట్టర్ లో రాయగా .. దానికి అతడి అభిమానుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.  పీరియాడికల్ యాక్షన్ సినిమా సెట్స్ లో కెజిఎఫ్ నటుడు యష్ తన సహనటి శ్రీనిధి శెట్టితో అసభ్యంగా ప్రవర్తించాడని ఇదే ట్విట్టర్ లో విచిత్రమైన వాదనను తెరపైకి తేవడం నెటిజనుల్లో హాట్ టాపిక్ అయ్యింది.

అయితే ఈ ప్రచారంపై అటు బాలీవుడ్ సహా ఇటు టాలీవుడ్ లోను విస్త్రతంగా చర్చ సాగుతోంది. ఇదంతా ఫేక్ ప్రచారమని పలువురు సినీక్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. ఇలాంటి ట్విట్టర్ వినియోగదారులు అర్ధంపర్థంలేని గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శిస్తున్నారు. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడుతూ- ట్విట్టర్ లో కొందరు గత కొన్నేళ్లుగా చెత్త  కథనాలను రాస్తున్నారు. ఈ ఖాతాలను మొదట డియాక్టివేట్ చేయాలి... అని వ్యాఖ్యానించారు. తనపై పుట్టుకొచ్చిన పుకారు గురించి అక్షయ్ ఇటీవల ఒక జోక్ చేసాడు. "అతడు ఎవరో కానీ నా సినిమాలపై ఇతర సమీక్షలను కాపీ పేస్ట్  చేసాడని.. అతడు ఫేక్ సెన్సార్ సభ్యుడు అని విమర్శించాడు. ఆ వ్యక్తి ఎవరో కానీ కేవలం బెడ్ రూమ్ స్టోరీలు మాత్రమే రాస్తున్నాడు.. అని అక్షయ్ తన పరిశీలనను బయటపెట్టారు.

యాడ్ గురు ప్రహ్లాద్ కక్కర్ సైతం ఇలాంటి ఫేక్ ట్విట్టరాటీలపై విరుచుకుపడ్డారు. "ప్రముఖులంతా సాఫ్ట్ టార్గెట్ లు కాబట్టి.. ఎవరైనా వారిని నాశనం చేయొచ్చు. ఆ వ్యక్తి ఎవరో కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఫేక్ ప్రచారం చేస్తున్నాడు. హానికరమైన వార్తలను పోస్ట్ చేసి సంపాదించాలని చూస్తున్నాడు" అని వ్యాఖ్యానించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు యువతరం నమ్మకూడదు. రుజువులు లేని ప్రచారాన్ని లైట్ తీస్కోవాలని కూడా పలువురు సూచిస్తున్నారు. కేవలం పైన పేర్కొన్న ప్రముఖులే కాదు.. చాలా మంది సెలబ్రిటీలు ఇతర జెంటిల్మన్ కూడా ఇలాంటి ఫేక్ ప్రచారంతో తీవ్రంగా హర్ట్ అవుతున్నారని కూడా వెల్లడించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.