#ట్రేడ్ లెక్క.. వకీల్ సాబ్ కి 10కోట్ల లాస్ తప్పదా?

Wed Apr 21 2021 16:00:01 GMT+0530 (IST)

# Trade calculation .. Is 10 crore loss wrong for Vakeel Saab?

రకరకాల అవాంతరాల నడుమ పవన్ `వకీల్ సాబ్` రిలీజైంది. ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కాయి. బాక్సాఫీస్ వద్ద ఆశించినట్టే పవన్ మానియా కొనసాగింది. తొలి వీకెండ్ మూడు రోజులకే ఈ చిత్రం 54 కోట్లు పైగా షేర్ వసూలు చేసింది. కానీ ఆ తర్వాత 20కోట్లు వసూలు చేసేందుకు చాలా సమయం తీసుకుంది.ఈ చిత్రం మొదటి వారానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.71 కోట్ల వరకు వెనక్కు రాబట్టగా వరల్డ్ వైడ్ 83కోట్ల షేర్ ని దక్కించుకుంది. అయితే ఈ సినిమా 90 కోట్లు పైగానే బిజినెస్ చేసింది. అంటే మరో 10కోట్ల షేర్ వసూలు చేస్తే కానీ పంపిణీ వర్గాలకు నష్టాలు తప్పినట్టు కాదు. ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే ఆ మొత్తం థియేటర్ల నుంచి వసూలు చేయాల్సి ఉండగా.. ఇప్పటికే సెకండ్ వేవ్ ప్రభావంతో థియేటర్లు ఖాళీ అయిపోయాయని చెబుతున్నారు.

ఏపీలో 50శాతం ఆక్యుపెన్సీ.. తెలంగాణలో నైట్ కర్ఫ్యూలు వకీల్ సాబ్ పై ప్రతికూల ప్రభావం చూపుతాయనడంలో సందేహమేం లేదు. ఇక తొలి వీకెండ్ లోనే మొత్తం వసూలు చేసేందుకు నిర్మాతలు టిక్కెట్టు ధరలు పెంచుకునే మంత్రాంగం పటిస్తున్నారు. బెనిఫిట్ షోలు అదనపు షోలు అంటూ చాలా ప్లాన్ చేస్తారు. కానీ ఏపీ ప్రభుత్వం టిక్కెట్ ధరల్ని తగ్గిస్తూ జారీ చేసిన జీవో వకీల్ సాబ్ ని దెబ్బ కొట్టింది.

టిక్కెట్టు ధరల తగ్గింపు.. అదనపు షోలను రద్దు చేయడంతో వసూళ్లపై ఆ ప్రభావం కొంత కనిపించిందని ట్రేడ్ విశ్లేషించింది. ఇన్ని అవాంతరాలు ఉన్నా.. ఓవైపు ఫ్యామిలీస్ మహిళలు ఆదరించడం వల్లనే వకీల్ సాబ్ తొలి వీకెండ్ బ్రహ్మాండమైన వసూళ్లను రాబట్టిందని అంచనా వేస్తున్నారు. సెకండ్ వేవ్ స్పీడ్ లేకపోయి ఉంటే వకీల్ సాబ్ కి బ్రేక్ ఈవెన్ సాధ్యమయ్యేదేమో!