Begin typing your search above and press return to search.

ఢీ సీక్వెల్లో ట‌వ‌ర్ బ్యూటీ చిట్టి ఫ‌రియా..?

By:  Tupaki Desk   |   15 Jun 2021 7:30 AM GMT
ఢీ సీక్వెల్లో ట‌వ‌ర్ బ్యూటీ చిట్టి ఫ‌రియా..?
X
మొద‌టి లాక్ డౌన్ అనంత‌రం అన్ లాక్ ప్ర‌క్రియ‌లో రిలీజైన `జాతిర‌త్నాలు` సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో న‌వీన్ పోలిశెట్టి రేంజు అమాంతం పెరిగింది. అలాగే క‌థానాయిక గా న‌టించిన‌ తెలుగ‌మ్మాయి ఫ‌రియా అబ్ధుల్లా పేరు మార్మోగింది. త‌న‌దైన అందం ఒడ్డు పొడుగు న‌ట‌న అన్నీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు పిచ్చిగా న‌చ్చేశాయి. ఆ త‌ర్వాత ఈ హైద‌రాబాదీ జాతిర‌త్నం కోసం ప‌లువురు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు క్యూ క‌ట్టార‌ని క‌థ‌నాలొచ్చాయి.

అయితే చిట్టి ఫ‌రియా త‌న‌వైపు వ‌చ్చిన ప్ర‌తిదీ అంగీక‌రించ‌డం లేదు. ప్రాజెక్ట్ రేంజును బ‌ట్టి మాత్ర‌మే ఆచితూచి సంత‌కం చేస్తున్నార‌ని తెలిసింది. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాల్లో ఫ‌రియాకు భారీ ఫాలోయింగ్ పెరిగింది. ఇన్ స్టా వేదిక‌గా నిరంత‌రం డ్యాన్సింగ్ వీడియోలు ఫోటోల‌ను ఫ‌రియా షేర్ చేస్తూ ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటోంది.

తాజా స‌మాచారం మేర‌కు ఫ‌రియాకు మంచు కాంపౌండ్ నుంచి బిగ్ ఆఫ‌ర్ ద‌క్కింద‌ని తెలిసింది. మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించనున్న ఢీ సీక్వెల్ కోసం ఫరియా అబ్దుల్లాను సంప్ర‌దించారు. విష్ణు స్వ‌యంగా ఈ టవ‌ర్ బ్యూటీని ఒప్పించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం సంప్ర‌దింపులు సాగుతున్నాయి. ఫ‌రియా న‌టించేందుకు అంగీక‌రించిన‌ట్టేన‌ని గుస‌గుసలు వినిపిస్తున్నాయి. అయితే ప్ర‌తిదీ అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంటుంది.