సమంత శాకుంతలం.. టఫ్ ఫైట్..!

Fri Mar 17 2023 10:36:54 GMT+0530 (India Standard Time)

Tough Fight For Shakunthalam Film

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత లీడ్ రోల్ లో తెరకుఎక్కనున్న సినిమా శాకుంతలం. రుద్రమదేవి లాంటి సినిమా తీసిన గుణశేఖర్ నుంచి వస్తున్న మరో మైథలాజికల్ మూవీ శాకుంతలం. ప్రచార చిత్రాలతో సినిమాపై మంచి బజ్ ఏర్పరచుకున్న ఈ సినిమాను ముందు ఫిబ్రవరి 17న రిలీజ్ చేయాలని అనుకున్నా కొన్ని కారణాల వల్ల కుదరలేదు.ఫైనల్ గా సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నారు. సమంత కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కు రెడీ అంటుంది. రీసెంట్ గా చిత్ర యూనిట్ పెద్దమ్మ టెంపుల్ కి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకున్నారు.

అంతేకాదు ఫైనల్ కాపీ చూసిన సమంత సినిమా సూపర్ అనేసింది. గుణశేఖర్ మీద అభిమానం రెట్టింపు అయ్యిందని అన్నది. అయితే సమంత శాకుంతలం బాక్సాఫీస్ దగ్గర టఫ్ ఫైట్ ఎదుర్కోబోతుంది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 21 వరకు ప్రతి వారం క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మార్చి 30న నాని దసరా అంటూ వస్తున్నాడు.

ఈసారి నాని మాస్ ఫోర్స్ బాక్సాఫీస్ పై స్పష్టంగా కనిపించేలా ఉంది. ఇక ఏప్రిల్ 7న రవితేజ రావణాసుర వస్తుంది. ధమాకా వాల్తేరు వీరయ్య హిట్లతో రవితేజ కూడా సూపర్ ఫాం లో ఉన్నాడు. ఈ ఇంప్యాక్ట్ రావణాసుర మీద పడుతుంది.

ఈ రెండిటితో పాటుగా సమంత శాకుంతలం ఏప్రిల్ 14న వస్తుంటే ఆ నెక్స్ట్ వీక్ ఏప్రిల్ 21న సాయి ధరం తేజ్ విరూపాక్ష సినిమా రిలీజ్ అవుతుంది. థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. సో సమంతకు వారం ముందు వారం తర్వాత రెండు సినిమాలు అంచనాలతో వస్తున్నాయి. శాకుంతలం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటే వారం పాటు ఆ సినిమాకు ఛాన్స్ ఉంటుంది.

యశోద సినిమా టైం లో మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత ఆ మూవీ కోసం కేవలం ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చింది. శాకుంతలం సినిమాకు మాత్రం బాగా ప్రమోషన్స్ చేయాలని చూస్తుంది. సమంత ఇన్వాల్వ్ మెంట్ ఎంత ఎక్కువ ఉంటే సినిమాకు అంత కలిసి వస్తుందని అంటున్నారు. మొత్తానికి సమంత శాకుంతలం ఈ రేసులో గెలుస్తుందా లేదా అన్నది చూడాలి.      నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.