Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: వేశ్యలుగా ముద్ర వేసిన నాయిక‌లు

By:  Tupaki Desk   |   31 Jan 2023 5:00 AM
టాప్ స్టోరి: వేశ్యలుగా ముద్ర వేసిన నాయిక‌లు
X
వేశ్య పాత్ర‌ల్లో న‌టించ‌డం అంటే ఆషామాషీ కాదు. వేశ్య‌లు నివ‌శించే చోటికి వెళ్లి వారిని క‌లిసి లైవ్ గా అక్క‌డి జీవ‌న‌విధానం ఎలా ఉంటుందో గ‌మ‌నించాలి. వేశ్య శ‌రీర భాష‌.. మాట తీరు .. ముఖాభిన‌యం.. విభిన్న‌మైన ఎక్స్ ప్రెష‌న్స్ ని ఒలికించే తీరు ప్ర‌తిదీ నేర్చుకోవాలి. 'గంగూభాయి క‌థియావాడి' చిత్రం కోసం ఆలియా లైవ్ గా పాఠాలు నేర్చుకుంది. ఇంత‌కుముందు క‌రీనాక‌పూర్ .. ట‌బు లాంటి నాయిక‌లు వేశ్య‌ల ఆహార్యం ఎలా ఉంటుందో ప‌రిశీలించేందుకు ముంబై రెడ్ లైట్ ఏరియాకు వెళ్లి అక్క‌డ నేరుగా వేశ్య‌ల నుంచి నేర్చుకున్నారు.

అయితే ఇలాంటి ఛాలెంజింగ్ పాత్ర‌లను టాలీవుడ్ లో లేదా సౌత్ లో ఎవ‌రు స్వీక‌రించారు? అన్న‌ది ఆరా తీస్తే తెలిసిన సంగ‌తులివి. ప‌లువురు సౌత్ హీరోయిన్లు తమ కెరీర్ లో అత్యంత సాహసోపేతమైన పాత్రలను పోషించారు! అందులో వేశ్య పాత్ర ఒక‌టి. నిజానికి ఇలాంటి పాత్ర‌ను ఒప్పుకోవాలంటేనే నిజంగానే ధైర్యం ఉండాలి. త‌మ‌కు గ‌ట్స్ ఉన్నాయ‌ని ప‌లువురు నాయిక‌లు నిరూపించారు.

అరుంధ‌తి - పంచాక్ష‌రి లాంటి చిత్రాల‌తో నాయికా ప్ర‌ధాన పాత్ర‌ల్లో మెప్పించిన అనుష్క 'వేదం' చిత్రంలో వేశ్య పాత్ర‌లో అద్భుతంగా అభిన‌యించింది. ఆ పాత్ర కోసం కొన్ని లైవ్ సెష‌న్స్ కి ఎటెండ‌య్యాన‌ని అప్ప‌ట్లో తెలిపింది. బాల‌కృష్ణ పాండురంగ‌డు చిత్రంలో ట‌బు వేశ్య గా న‌టించారు. అప్ప‌టికే చాందిని బార్ లాంటి చిత్రంలో వేశ్య‌గా న‌టించి జాతీయ ఉత్త‌మ న‌టిగా అవార్డ్ అందుకున్న ట‌బు కెరీర్ లో ప‌లుమార్లు వేశ్య పాత్ర‌లో న‌టించారు. ఇటీవ‌ల షాహిద్ క‌పూర్ సోద‌రుడు ఇషాన్ ఖ‌త్త‌ర్ న‌టించిన సినిమాలోను త‌న‌కంటే వ‌య‌సులో చాలా చిన్న‌వాడైన యువ‌కుడితో రొమాన్స్ చేసే వేశ్య పాత్ర‌లో ట‌బు న‌టించారు.

అందాల క‌థానాయిక ఛార్మి మంత్ర చిత్రంతో కుర్ర‌కారు గుండెల్లో నిదురించింది. మంత్ర‌ముగ్ధం చేసే న‌ట‌న‌తో క‌ట్టి ప‌డేసే ఈ బ్యూటీ ఇంత‌కుముందు పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన జ్యోతిల‌క్ష్మి చిత్రంలో వేశ్య‌గా న‌టించింది. ప్రేమ ఒక మైకం అనే చిత్రంలోను వేశ్య పాత్ర‌లో అభిన‌యించి మెప్పించింది. విదేశీ క్రీడాకారుడు ఆండ్రూ కోశ్చీవ్ ని పెళ్లాడి సెకండ్ ఇన్నింగ్స్ లోను అద్భుత‌మైన పాత్ర‌ల్లో రాణిస్తోంది శ్రీ‌య శ‌ర‌ణ్‌. శ్రీ‌య గ‌తంలో పవిత్ర అనే చిత్రంలో వేశ్య గా న‌టించింది. స్వ‌త‌హాగా అభిన‌య నేత్రి అయిన శ్రీయ వేశ్య పాత్ర‌కు జీవం పోసింది.

న‌టి సంగీత‌లో విల‌క్ష‌ణ ఆహార్యం డ్యాన్సింగ్ ప్ర‌తిభ‌ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. ధనం అనే చిత్రంలో సంగీత వేశ్య పాత్ర‌లో అద్భుతంగా న‌టించింది. అలాగే ధూల్ పేట చిత్రంలో బాపు బొమ్మ‌ స్నేహ వేశ్య పాత్ర‌లో అభిన‌యించింది. త‌న‌కు ఉన్న గుర్తింపుకు పూర్తి భిన్నంగా వేశ్య‌గా న‌టించేందుకు స్నేహ చేసిన సాహ‌సం ఎంతో గొప్ప‌ది.

బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ D-DAY (గెలుపు గుర్రం)లో శృతి హాసన్ వేశ్య పాత్ర‌లో అల‌రించింది. తెలుగ‌మ్మాయి బిందు మాధవి - సెగ చిత్రంలో వేశ్య‌గా న‌టించి మెప్పించింది. చెన్నై ప‌రిశ్ర‌మ‌లో స్థిర‌ప‌డిన తెలుగ‌మ్మాయిగా బిందుమాధ‌వికి ఐడెంటిటీ ఉంది. అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ చిత్రంలో మధు ప్రియ వేశ్య‌గా న‌టించింది.

అలాగే ధైర్యం చిత్రంలో అందాల సీత అంజలి ధైర్యంగా వేశ్య పాత్ర‌లో అభిన‌యించింది. షాపింగ్ మాల్ చిత్రంలో అమాయ‌క‌ ప్రేమికురాలిగా అద్భుతంగా అభిన‌యించిన తెలుగ‌మ్మాయి అంజ‌లి కెరీర్ లో విల‌క్ష‌ణ పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. వేశ్య పాత్ర అందుకు భిన్న‌మైన‌ది. క‌మ‌ల‌తో నా ప్ర‌యాణంలో మ‌రో తెలుగ‌మ్మాయి అర్చ‌న వేశ్య‌గా అభిన‌యించారు.

రమ్య కృష్ణ .. పంచతంత్రియం చిత్రంలో వేశ్య‌గా న‌టించారు. బాహుబ‌లి శివ‌గామి గా వ‌ర‌ల్డ్ వైడ్ గుర్తింపు ఉన్న ర‌మ్య కృష్ణ కెరీర్ లో ఎన్నో విల‌క్ష‌ణ పాత్ర‌ల‌తో మెప్పించారు. న‌ర‌సింహా లో ర‌జ‌నీకాంత్ తో పోటీప‌డి విల‌నీ పండించిన సంగ‌తి తెలిసిందే. అమ్మోరుగా పోట్ల‌గిత్త‌గా మెప్పించిన ర‌మ్య కృష్ణ వేశ్య పాత్ర‌లో ఎంతో అద్భుతంగా ఒదిగిపోయి న‌టించారు.

అల‌నాటి మేటి క్లాసిక్ చిత్రం ప్రేమాభిషేకంలో జ‌య‌సుధ వేశ్య పాత్ర‌లో ఎంతో నేచుర‌ల్ గా న‌టించి స‌హ‌జ‌న‌టికి రీప్లేస్ మెంట్ అన్న‌దే లేద‌ని నిరూపించారు. అలాగే మేఘ సందేశం చిత్రంలో జ‌య‌ప్ర‌ద వేశ్య పాత్ర మ‌ర్చిపోలేనిది.

ఆలియాభ‌ట్ న‌టించిన గంగూభాయి క‌థియావాడి త‌న కెరీర్ బెస్ట్ చిత్రాల‌లో ఒక‌టి. వేశ్య నుంచి నాయ‌కురాలిగా మారిన యువ‌తిగా ఆలియా న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల‌ ప్ర‌శంస‌లు కురిసాయి. భ‌న్సాలీ తెర‌కెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ గాను నిలిచింది. ర‌కుల్ ఇటీవ‌ల ఓ చిత్రంలో వేశ్య‌గా ప్ర‌యోగం చేస్తోంది. ఆ సినిమా విడుద‌ల‌కు రావాల్సి ఉంది. ఖ‌లీపిలీలో అన‌న్య పాండే వేశ్య పాత్ర‌లో న‌టించింది. మునుముందు ప‌లువురు యువ‌నాయిక‌లు వేశ్య పాత్ర‌ల్లో మెప్పించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వాటి వివ‌రాలు త్వ‌ర‌లో రివీల్ కానున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.