టాప్ ఫ్రాఫిట్ సినిమాలివే.. వీరయ్య ఏ స్థానంలో ఉందంటే?

Mon Jan 30 2023 16:03:16 GMT+0530 (India Standard Time)

Top profit movies.. Veeraya in which position?

మెగాస్టార్ చిరంజీవి రవితేజ నటించిన 'వాల్తేరు వీరయ్య' బాక్సాఫీస్ ముందు ఇంకా తన జోరును కొనసాగిస్తోంది. విడుదలై 17 రోజులు అవుతున్నా కలెక్షన్స్ ఏమాత్రం తగ్గట్లేదు. దాదాపు రూ.88కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా 17 రోజుల్లో వరల్డ్ వైడ్గా రూ.127 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోగా.. రూ. 217.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయట. ఈ చిత్రం దాదాపు రూ.45.29కోట్ల వరకు ప్రాఫిట్ అందుకున్నట్లు తెలిసింది.



తెలుగు చిత్రసీమ స్థాయిని.. భారతీయ సినిమాల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా బాహుబలి సిరీస్. ప్రభాస్ రానా అనుష్క తమన్నా ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ఈ దృశ్య కావ్యాలు.. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు అందుకున్నాయి. రెండో భాగం రూ.352కోట్లతో రూపొందగా.. రూ.508కోట్ల లాభం పొందినట్లు సమాచారం. ఇక తొలి భాగం రూ.118కోట్లతో తెరకెక్కగా రూ.186కోట్లు లాభాల్ని అందుకుంది.

రామ్చరణ్-తారక్ కాంబినేషన్లో తెరకెక్కిన విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను అందుకుని బిగ్గెస్ట్ హిట్గా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇది కూడా నిర్మాతలకు అదిరిపోయే లాభాల్ని తెచ్చిపెట్టింది. ఇక అల్లుఅర్జున్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో రూపొందిన సూపర్ హిట్ సినిమా అలవైకుంఠపురంలో.

ఈ చిత్రం కూడా రూ.84.34కోట్లతో రూపొంది దాదాపు రూ.75.88కోట్ల ప్రాఫిట్ను మేకర్స్కు తెచ్చిపెట్టిందట. ఇందులో హీరోయిన్గా పూజాహెగ్డే నటించి. ఇక ఈ చిత్ర పాటలకు కూడా సెన్సేషనల్ హిట్ అయ్యాయి.
కన్నడ దివంగత నటుడు పనీత్ రాజ్కుమార్ నటించిన గంధర్వ గుడి రూ.15కోట్లతో రూపొందింది రూ.55.43కోట్ల లాభాల్ని అందుకుంది.

విక్టరీ వెంకటేశ్-మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఫన్ ఎంటర్టైనర్ ఎఫ్ 2 ప్రేక్షకుల్ని తెగ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని దాదాపు రూ.34.5కోట్ల బడ్జెట్తో రూపొందించారు. ఇక ఈ సినిమాకు దాదాపు రూ.50కోట్ల లాభం వచ్చిందట. రామ్చరణ్ కెరీర్నే మలుపు తిప్పిన సినిమా రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రూ. 80కోట్లతో తెరకెక్కి.. రూ.47.52 కోట్ల లాభాల్ని నిర్మాతలకు తెచ్చిపెట్టింది. ఇందులో సమంత హీరోయిన్.

ఇక యంగ్ హీరో నిఖిల్ నటించిన సినిమా కార్తికేయ 2 పాన్ ఇండియా లెవల్లో విడుదలై మంచి టాక్ను అందుకుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. ఈ సినిమా అయితే అతి తక్కువ బడ్జెట్ రూ.12.8కోట్లతో రూపొంది రూ. 45.60కోట్ల ప్రాఫిట్ను సాధించిందని సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.