విస్కీ బాటిల్ తో హీరోయిన్ ఇంటికెళ్లాడు

Wed Jul 08 2020 11:15:37 GMT+0530 (IST)

Top Director Went to Actress House with Liquor Bottle

తాగి తందనాలాడడం అన్నిచోట్లా ఉన్నదే. కానీ ఆ డైరెక్టర్ మాత్రం నేరుగా విస్కీ బాటిల్ తీసుకుని హీరోయిన్ ఇంటికే వెళ్లాడట. ఇది ఇప్పుడే జరిగిన ఘటన కాకపోయినా ఎప్పటికీ మర్చిపోలేనిదని వెటరన్ నటి అను అగర్వాల్ తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే...1990లో రిలీజైన `ఆషికి` ఎంతటి సంచలనమో తెలిసిందే. అప్పట్లో ఈ మూవీ గురించి నార్త్ లోనే కాదు.. ఇటు దక్షిణ భారత దేశంలోనూ ఎంతగానో ముచ్చటించుకున్నారు. ముఖ్యంగా ఆషికి సంగీతాన్ని మనవాళ్లు ఎంతో ఇష్టపడ్డారు. ఈ చిత్రంలోని హిందీ పాటలు దేశవ్యాప్తంగా చార్ట్ బస్టర్లుగా నిలిచాయి.

ఇందులో నాటి మేటి కథానాయిక అను అగర్వాల్ నటించారు. అయితే అప్పట్లోనే పరిశ్రమలో కొత్తగా ప్రవేశించినప్పుడు కాస్టింగ్ కౌచ్ అనుభవం అయ్యిందట. తన అనుభవాన్ని తాజా ఇంటర్వ్యూలో మీడియాతో పంచుకున్నారు. పేర్లు చెప్పకపోయినా.. ఒక టాప్ డైరెక్టర్ మధ్యాహ్నం వేళ విస్కీ బాటిళ్లతో తన ఇంటికి వచ్చారని ఆమె తెలిపారు. కథ చెప్పేందుకని వచ్చి మద్యం బాటిల్ ఓపెన్ చేశాడట. కానీ ఆమె తన మనస్సాక్షిని చంపుకోలేక మర్యాదగా అక్కడ నుంచి వెళ్ళమని కోరారు. అలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండడమే సరైనది అని అను అగర్వాల్ బలంగా అనుకున్నారట. ఏ స్త్రీ అయినా తన మార్గంలో తాను వెళ్లాలని అనుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు.. అది పూర్తిగా మన వ్యక్తిగతం!! అని ఆమె నిరూపించారు.