Begin typing your search above and press return to search.

Boxoffice: ఇప్పుడు టాప్ 5 ఇండియన్ సినిమాలివే..!

By:  Tupaki Desk   |   17 March 2023 7:00 PM GMT
Boxoffice: ఇప్పుడు టాప్ 5 ఇండియన్ సినిమాలివే..!
X
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, సాండల్ వుడ్.. ఇలా భారతదేశంలో అనేక రకాల సినీ ఇండస్ట్రీలు ఉన్నాయి. అయితే ఇక్కడి సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తుంటుంది. ఇక్కడి సినిమాలు అన్నా, హీరోహీరోయిన్లు ఇండియన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇక్కడ రిలీజ్ అయిన ఏ సినిమాను అయినా దాదాపు అందరూ చూస్తుంటారు. ప్రాంతీయతతో సంబంధం లేకుండా సినిమాలను వీక్షిస్తుంటారు. హీరోహీరోయిన్లను కూడా విపరీతంగా అభిమానిస్తుంటారు. అయితే ఇండియాలో రిలీజ్ అయిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబట్టి టాప్ 5 లో నిలిచిన సినిమాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన దంగల్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1958 కోట్ల రూపాయలను వూసూలు చేసి బాక్సాఫీసును బద్ధలు చేసింది.

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రాణా, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లు హీరోలుగా అనుష్క, తమన్నా హీరోయిన్లుగా తీసిన బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్టు అయింది. పార్ట్ 1 కంటే కూడా పార్ట్ 2నే విపరీతమైన వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా.. 1810 కోట్ల రూపాయలను వసూలు చేసి సంచలనం సృష్టించింది.

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా బాక్సాఫీసును బద్ధలు చేసింది. అనేక అవార్డులను సొంతం చేసుకోవడంతో పాటు మరెన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 1236.50 కోట్ల రూపాయలను వసూలు చేసి టాప్ 3 గా నిలిచింది.

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్ 2 కూడా భారీ వసూళ్లను సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 1233 కోట్ల రూపాయలను రాబట్టుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది. అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 4 సినిమాగా చరిత్రకెక్కింది.

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా భారీ వసూళ్లను సాధించింది. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత షారుఖ్ నటించిన సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. జాన్ అబ్రహం, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1048 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 5 చిత్రంగా నిలిచింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.