భారీ కలెక్షన్లను రాబట్టిన టాప్ 5 హిందీ సినిమాలు ఇవే..!

Fri Jan 27 2023 18:00:01 GMT+0530 (India Standard Time)

Top 5 Bollywood Films Collections

బాలీవుడ్.. బాలీవుడ్ కు ఉన్న క్రేజ్ మరే సినిమా ఇండస్ట్రీకి లేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే బాలీవుడ్ లో భారీ వసూళ్లను రాబట్టి సూపర్ డూపర్ హిట్లుగా నిలిచిన ఐదు సినిమాలు ఎంటో అవి ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధించాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత నటించిన పఠాన్ సినిమా బాక్సాఫీసును షేక్ చేస్తోంది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇప్పటి వరకు 70 కోట్ల వసూళ్లను రాబట్టింది. తమిళ్ తెలుగుతో సహా పఠాన్ 2వ రోజున 72 కోట్ల కంటే ఎక్కువ నెట్ వసూలు చేసింది.

అలాగే యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందించిన కేజీఎఫ్ 2(హిందీ) కూడా భారీ వసూళ్లను రాబట్టి సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. సౌత్ కు మాత్రమే పరిమితమైన కన్నడ ఇండస్ట్రీ ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన ఈ సినిమా... హీరోయిజం కమర్షియల్ సినిమాకు సరికొత్త అర్థాన్ని ఇచ్చింది. రూ.40.5 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

యంగ్ హీరో ప్రభాస్ హీరోగా జక్కన్న దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2(హిందీ) తెలుగు సినీ ఇండస్ట్రీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించింది. ప్రభాస్ రానా తమన్నా అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసును కొల్లగొట్టింది. బాహుబలి బ్రేక్ చేసిన రికార్డులకు బాలీవుడ్ కూడా షేక్ అయింది. రూ.46.8 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది.

రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ విక్కీ కౌశల్ కలిసి నటించిన చిత్రం సంజు సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమా హీరో సంజయ్ దత్ జీవితం ఆధారంగా తీసిన చిత్రం. ఈ సినిమాలో సంజయ్ దత్ బాంబు పేలుళ్ల కేసులో అరెస్టవడం బయటకు రావడం మళ్లీ సినిమాల్లోకి రావడం వంటి అంశాలతో తెరకెక్కించారు. 2018 జూన్ 29వ విడుదలైన ఈ చిత్రం 38.6 కోట్ల వసూళ్లను రాబట్టి బాలీవుడ్ టాప్ కలెక్షన్లు సాధించన సినిమాగా చరిత్రకెక్కింది.

రెమో డిసౌజా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన రేస్3 సినిమా భారీ వసూళ్లను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అనిల్ కపూర్ బాబీ డియోల్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ డైసీ షా సాకిబ్ సలీమ్ లు నటించిన ఈ సినిమా రూ. 38.1 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.      నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.