Begin typing your search above and press return to search.

భార‌త‌దేశంలో టాప్ 10 సంప‌న్న క‌థానాయిక‌లు

By:  Tupaki Desk   |   3 Jun 2023 9:00 AM GMT
భార‌త‌దేశంలో టాప్ 10 సంప‌న్న క‌థానాయిక‌లు
X
భార‌త‌దేశంలో టాప్ 10 రిచెస్ట్ హీరోయిన్స్ ఎవ‌రు? .. ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కావాలంటే కాస్త హిస్ట‌రీని త‌వ్వి తీయాలి. వెట‌ర‌న్ హీరోయిన్ల సంప‌ద‌ల గురించి వ‌దిలేస్తే.... ఐశ్వ‌ర్యారాయ్- మాధురి ధీక్షిత్- క‌రీనా క‌పూర్ ఖాన్ కాస్ట్ లీ లైఫ్ లీడ్ చేసిన‌ స‌మ‌కాలిక క‌థానాయిక‌లు. త‌మ ప్ర‌తిభ అద్భుత‌మైన డ్యాన్సింగ్ నైపుణ్యంతో ప్ర‌జ‌ల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయిన మేటి న‌టీమ‌ణులు వీరంతా. సినిమాలు స‌హా వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించినందుకు భారీ పారితోషికాలు అందుకున్నారు. స్వ‌యం సంపాద‌కులుగా వీరంతా ఓ వెలుగు వెలిగారు. ఆ త‌ర్వాతి జ‌న‌రేష‌న్ లో క‌త్రిన‌- క‌రీనా- దీపిక‌- ప్రియాంక చోప్రా- అనుష్క శ‌ర్మ‌- విద్యాబాల‌న్ ఓ వెలుగు వెలిగారు. ఇటీవ‌లి కాలంలో సౌత్ నుంచి స‌మంత పేరు గొప్ప సంపాద‌కుల జాబితాలో మార్మోగుతోంది.

అయితే వీళ్ల సంపాద‌న ఆస్తుల లెక్క‌లు ప‌రిశీలిస్తే ఇటీవ‌ల షాకిచ్చే నిజాలు బ‌య‌టికొచ్చాయి. మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వర్య రాయ్ బచ్చన్ నికర ఆస్తుల విలువ సుమారు రూ. 828 కోట్లుగా ఉంద‌ని ప్ర‌ముఖ జాతీయ మీడియా ఇటీవ‌ల సంచ‌ల‌న‌ క‌థ‌నం వెలువ‌రించింది. కాలానికి అతీతంగా ఇప్ప‌టికీ మేటి అంద‌గ‌త్తెగా సుస్థిర‌మైన అభిమానుల‌ను క‌లిగి ఉంది ఐష్‌. పొన్నియ‌న్ సెల్వ‌న్ ఫ్రాంఛైజీతో ఐష్ కంబ్యాక్ అదిరిపోయింది. ప‌రిశ్ర‌మ‌లో ప్రభావవంతమైన నటీమ‌ణుల్లో ఐశ్వర్యరాయ్ పేరు ఇంకా చెక్కు చెద‌ర‌లేదంట అర్థం చేసుకోవాలి.

పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ ఎప్పుడూ చార్ట్ లో టాప్ లిస్ట్ లో ఉన్నారు. ఒక్కో సినిమాకు దాదాపు రూ. 10 కోట్లు వసూలు చేస్తున్న ఐష్ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించేందుకు భారీ మొత్తంలో వ‌సూలు చేస్తున్నారు.

ఆ త‌ర్వాత గ్లోబ‌ల్ స్టార్ గా పాపుల‌రైన ప్రియాంక చోప్రా జోనాస్ నికర ఆస్తుల‌ విలువ సుమారు రూ. 580 కోట్లు అని తేలింది. ఇది పీసీ ఇండివిడ్యువ‌ల్ ఆస్తి. నిక్ జోనాస్ ఆస్తుల‌తో ఎలాంటి సంబంధం లేకుండా గ‌ణాంకం. న్యూయార్క్ లోని రెస్టారెంట్ సహా వివిధ వ్యాపారాలలో భారీ పెట్టుబడులు పెట్టిన ప్రియాంక అస్సెట్స్ విలువ అంత‌కంత‌కు పెరుగుతోందే కానీ త‌ర‌గ‌డం లేదు. ఒక్కో సినిమాకి పీసీ 10 కోట్లు పైగానే పారితోషికం అందుకుంటోంది. హాలీవుడ్ లో ఈ విలువ డాల‌ర్ల‌లోకి మారింది.

నేటిత‌రంలో అలియా భట్ దూకుడు గురించి తెలిసిందే. వ‌రుస‌గా పాన్ ఇండియా ఆఫ‌ర్ల‌తో క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉంది. ఆలియా నిక‌ర ఆస్తుల విలువ‌ దాదాపు రూ. 557 కోట్లు. భారతదేశంలోని అత్యంత సంపన్న నటీమణులలో యువ‌న‌టి ఆలియా స్థానం చెక్కు చెద‌ర‌నిది. ఒక్కో సినిమాకి 8 కోట్లు పైగానే వ‌సూలు చేస్తున్న అగ్ర క‌థానాయిక‌గా ఆలియా పేరు మార్మోగుతోంది.

కరీనా కపూర్ ఖాన్ సైజ్ జీరో క్వీన్ గా ఒక త‌రాన్ని ఏలింది. ఏకంగా రూ. 440 కోట్ల నికర ఆస్తుల‌తో టాప్ 10 జాబితాలో త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అసాధారణ ప్రతిభ.. అద్భుత నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌తో శాశ్వతమైన ప్రజాదరణ క‌లిగి ఉన్న న‌టిగా క‌రీనా పాపుల‌ర్. ఒక్కో సినిమాకి 10కోట్లు అంత‌కుమించి వ‌సూలు చేసే న‌టిగా పేరుంది. ఇక వేల కోట్ల ఆస్తులు క‌లిగి ఉన్న సైఫ్ అలీఖాన్ కి భార్య‌గా క‌రీనా స్థాయి చుక్క‌ల్లోనే ఊహించ‌వ‌చ్చు.

జాతీయ స్థాయిలో టెన్నిస్ క్వీన్ గా ఓ వెలుగు వెలిగిన‌ దీపికా పదుకొణే ఆ త‌ర్వాత ఓంశాంతి ఓంతో క‌థానాయిక అయ్యింది. బాలీవుడ్ ని ద‌శాబ్ధంన్న‌ర పైగా ఏలింది. ఇప్ప‌టికీ ఏల్తూనే ఉంది. పెళ్ల‌యినా దీపిక‌కు యూత్ లో క్రేజ్ ఎంత‌మాత్రం త‌గ్గ‌లేదు అంటే దానికి కార‌ణం ఈ బ్యూటీలో దూకుడు కూడా త‌గ్గ‌లేద‌నే. దాదాపు రూ. 314 కోట్ల నికర ఆస్తుల‌తో దీపిక కూడా టాప్ 10 న‌టీమ‌ణుల జాబితాలో నిలిచింది.న‌టిగా రాణించడంతో పాటు స్టార్టప్ లు - ఎఫ్ అండ్ బి బ్రాండ్ లలో చురుకైన పెట్టుబడులు పెట్టింది. సొంతంగా సినీనిర్మాణ సంస్థ‌ను దీపిక ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

క‌త్రిన కైఫ్ ఆస్తుల వివ‌రాల్లోకి వెలితే ఈ బ్యూటీ ఇప్ప‌టికే 150కోట్లు పైగా ఆర్జన‌తో టాప్ 10లో నిలిచింది. ఒక్కో సినిమాకుగాను 10 కోట్ల రూపాయ‌ల పారితోషికం తీసుకునే ఈ బ్యూటీ ప్ర‌క‌ట‌న‌లు.. సొంత‌ మేకప్‌ బ్రాండ్ 'కే బ్యూటీ' ద్వారా బాగా ఆర్జిస్తోంది.ఫిట్‌నెస్‌ బ్రాండ్ రీబాక్ కు బ్రాండ్‌ అంబాసిడర్ గా భారీ మొత్తాన్ని ఆర్జిస్తోంది. లండ‌న్ లోను క‌త్రినాకు ఆస్తులు ఉన్నాయి. మాధురి ధీక్షిత్ నీనే దాదాపు 100కోట్ల ఆస్తిప‌రురాల‌ని ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చాయి.

అనుష్క శ‌ర్మ వ్య‌క్తిగ‌త‌ ఆస్తులు సుమారు 220 కోట్లు. భ‌ర్త విరాట్ కోహ్లీ ఆస్తుల‌తో క‌లుపుకుంటే దాదాపు 900 కోట్లు పైమాటే. అయితే అనుష్క శ‌ర్మ క‌థానాయిక‌గా భారీ పారితోషికాలు అందుకుంటూనే ప‌లు బ్రాండ్ల‌కు ప్ర‌చార కాంట్రాక్టుల రూపంలో భారీగా ఆర్జిస్తోంది. వీట‌న్నిటినీ మించి అనుష్క శ‌ర్మ నిర్మాత‌గా పెద్ద స‌క్సెస్ అయిన క‌థానాయిక‌. 30కోట్ల పెట్టుబ‌డులు పెట్టి 100 కోట్లు పైగా ఆర్జించిన సినిమాల‌ను అనుష్క శ‌ర్మ నిర్మించింది.

ఐ.డబ్ల్యూ.ఎమ్ బజ్ వివ‌రాల ప్రకారం సమంత నిక‌ర‌ ఆస్తి విలువ 84 కోట్లుగా ఉంద‌ని క‌థ‌నాలొచ్చాయి. అక్కినేని నాగ‌చైత‌న్య నుంచి విడిపోయాక పూర్తిగా కెరీర్ పైనే దృష్టి సారించిన సమంత ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ ఒక్కో సినిమాకి 3-4కోట్లు ఆర్జిస్తూ ఆస్తుల‌ను బాగానే వెన‌కేసుకుంద‌న్న టాక్ ఉంది. మ‌యోసైటిస్ వంటి రుగ్మత త‌న‌ను ఇబ్బందికి గురి చేసినా కానీ మొక్క‌వోని ధీక్ష‌తో కెరీర్ ని ముందుకు సాగిస్తూ త‌న అభిమానుల‌కు స్ఫూర్తిగా నిలుస్తోంది సామ్.