Begin typing your search above and press return to search.

ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ లో టాప్ 10 బాలీవుడ్ బ్యూటీస్.. వీరే!

By:  Tupaki Desk   |   19 Jun 2021 7:30 AM GMT
ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ లో టాప్ 10 బాలీవుడ్ బ్యూటీస్.. వీరే!
X
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ మిలియన్ల మంది అనుచరులతో.. అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా క్రొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించడం.. బ్రాండ్‌లను ప్రమోట్ చేయడం.. వారి పెట్స్ లేదా ఫ్యామిలీ ఫోటోస్ పోస్ట్ చేయడం వంటివి చేస్తుంటారు. అదేవిధంగా ఊహించని రేంజిలో ఫాలోయింగ్ సొంతం చేసుకుంటారు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఇంస్టాగ్రామ్ ఫాలోయర్స్ కలిగిన టాప్ 10 సెలబ్రిటీలు ఎవరో చూద్దాం. ఈ లిస్టులో టాలీవుడ్ నుండి ఒక్కరు కూడా బాలీవుడ్ హీరోయిన్స్ ఫాలోయింగ్ బీట్ చేయాలేకపోవడం గమనార్హం.

మొదటి స్థానంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నిలిచింది. ఈమె ఇంస్టాగ్రామ్ లో 64.5 మిలియన్స్ ఫాలోయింగ్ కలిగి ఉంది. ప్రస్తుతం అమ్మడు భర్త నిక్ జోనస్ తో కలిసి ఫారెన్ లో ఉంటోంది. అలాగే హాలీవుడ్ సినిమాలు టీవీ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంటోంది.

రెండో స్థానంలో సాహో బ్యూటీ శ్రద్ధాకపూర్ నిలిచింది. ఇప్పటికి శ్రద్ధా 62.8 మిలియన్స్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. కానీ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయేసరికి మళ్లీ బాలీవుడ్ పైనే దృష్టిపెట్టింది.

మూడో స్థానం సింగర్ నేహాకక్కర్ ది. బాలీవుడ్ ఇండస్ట్రీలో హుషారు పాటలను ఊపుతో పాడే సింగర్ నేహా. ఈమెకు ప్రస్తుతం 58.9 మిలియన్స్ ఫాలోయర్స్ ఉన్నారు. అసలు స్టార్ హీరోయిన్లను బీట్ చేసి ఓ సింగర్ నిలవడం విశేషం.

నాలుగో స్థానంలో దీపికా పదుకొనే దక్కించుకుంది. అమ్మడికి ప్రస్తుతం 57.1 మిలియన్స్ ఇంస్టా ఫాలోయర్స్ ఉన్నారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అలాగే త్వరలో డార్లింగ్ ప్రభాస్ సరసన చేయబోయే సినిమాతో సౌత్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది.

ఐదో స్థానంలో ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియాభట్ నిలిచింది. ఈ కుర్రభామకు ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో 53.5 మిలియన్స్ ఫాలోయర్స్ ఉన్నారు. ప్రస్తుతం చేతిలో పలు క్రేజీ బిగ్ ప్రాజెక్ట్స్ కలిగి ఉంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ డెబ్యూ చేయబోతుంది.

ఆరోస్థానంలో బాలీవుడ్ గ్లామర్ క్వీన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నిలిచింది. ఈ సాహో బ్యాడ్ గర్ల్ ఇంస్టా వేదికపై 52.2 మిలియన్స్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమాతో డెబ్యూ చేయబోతుంది.

ఏడో స్థానం కింగ్ కోహ్లీ వైఫ్ అండ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశర్మ దక్కించుకుంది. ఆమెకు ఇంస్టాలో 50.5 మిలియన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే బేబీ వామికకు జన్మనిచ్చి ఇంటిపట్టునే ఉంటోంది. అనుష్క చివరిగా జీరో సినిమాలో కనిపించింది. ఇప్పటివరకు సౌత్ లో సినిమాలు చేయలేదు. ఇకపై చేస్తుందేమో చూడాలి.

ఎనిమిదో స్థానంలో స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ నిలిచింది. ఈ భామకు ఇంస్టాగ్రామ్ లో 50.5 మిలియన్స్ ఫాలోయర్స్ ఉన్నారు. దాదాపు కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ ను ఏలుతోంది. ఆల్రెడీ తెలుగులో కూడా రెండు సినిమాలు చేసింది. ప్రస్తుతం టైగర్ సిరీస్ 3 మూవీ చేస్తోంది.

తొమ్మిదో స్థానంలో వరల్డ్ వైడ్ పాపులర్ శృంగారతార సన్నీలియోన్ నిలిచింది. సన్నీకి ఇంస్టాగ్రామ్ లో 46.1 మిలియన్స్ ఫాలోయర్స్ ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు సౌత్ సినిమాల్లో కూడా కనిపిస్తుంది. అలాగే ముగ్గురు పిల్లలకు తల్లిగా ఆదర్శంగా నిలుస్తోంది.

పదో స్థానంలో దిశాపటాని నిలిచింది. ఈ బ్యూటీకి ప్రస్తుతం 44.4 మిలియన్స్ ఫాలోయర్స్ ఉన్నారు. ఇప్పుడు పలు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో లోఫర్ సినిమా చేసింది కానీ సినిమా ప్లాప్ అవ్వడంతో మళ్లీ బాలీవుడ్ వైపు వెళ్ళిపోయింది. ఇటీవలే రాధే సినిమాతో పలకరించింది.