Begin typing your search above and press return to search.

11 సినిమాలు.. టాప్‌ హీరోగా మహేశ్

By:  Tupaki Desk   |   29 May 2023 6:00 PM GMT
11 సినిమాలు.. టాప్‌ హీరోగా మహేశ్
X
సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా పరిచయమైనా.. తనలోని అన్ని టాలెంట్లనూ బయటకు తెచ్చి.. చాలా తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగిపోయాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్తోన్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకుని రికార్డులు సాధించాడు.

ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు కొడుతూ దూసుకుపోతోన్న మహేశ్ బాబు.. కొన్ని ఏరియాల్లో తనదైన మార్కును చూపిస్తూ సత్తా చాటుతోన్నాడు. ముఖ్యంగా ఓవర్సీస్‌ ఏరియాలో ఈ స్టార్ హీరో చిత్రాలను మరింత ఆదరణ లభిస్తోంది. దీంతో అక్కడ అతడి సినిమాలకు భారీ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. ఫలితంగా మహేశ్ ఖాతాలో ఓ అరుదైన గొప్ప రికార్డు వచ్చి చేరిపోయింది.

ఓవర్సీస్‌లో 1 మిలియన్ డాలర్లు వసూళ్లు సాధించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటిది అక్కడ ఏకంగా 11 సార్లు ఈ మార్కును చేరుకున్నాడు టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు.

దీంతో టాలీవుడ్‌లో ఈ ఘనతను అందుకున్న ఏకైక హీరోగా అతడు రికార్డును సాధించాడు. అతడి తర్వాతి స్థానంలో నేచురల్ స్టార్ నాని, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు.

ఇండియా వ్యాప్తంగా చూసుకుంటే.. అందరి కంటే ఎక్కువగా 30 సార్లు ఓవర్సీస్‌లో 1 మిలియన్ మార్కును చేరుకుని టాప్ ప్లేస్‌లో ఉన్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. అతడి తర్వాత వరుసగా అక్షయ్ కుమార్ (25 సార్లు), సల్మాన్ ఖాన్ (23 సార్లు), హృతిక్ రోషన్ (17 సార్లు), ఆమిర్ ఖాన్ (13 సార్లు), అజయ్ దేవగణ్ (12 సార్లు) ఈ మార్కును చేరుకుని టాప్ 6 లిస్టులో ఉన్నారు.

తెలుగులో ఎక్కువ 1 మిలియన్ డాలర్ల మార్కును చేరుకుని టాప్‌లో ఉన్న మహేశ్ బాబు.. ఇండియా వ్యాప్తంగా మాత్రం 7వ స్థానంలో నిలిచాడు. ఇప్పుడీ న్యూస్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. దీంతో మహేశ్ బాబు అభిమానులు ఈ వార్తను సోషల్ మీడియా ద్వారా బాగా వైరల్ చేస్తోన్నారు.