Begin typing your search above and press return to search.

టాలీవుడ్ హీరోలని ఆ జాబితాలో చేర్చేస్తారా?

By:  Tupaki Desk   |   30 May 2023 9:35 AM GMT
టాలీవుడ్ హీరోలని ఆ జాబితాలో చేర్చేస్తారా?
X
బాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు మసగబారిపోవడానికి ప్రధాన కారణం అక్కడ స్టార్స్ అందరూ కూడా రాజకీయ పరంగా రెండు వర్గాలుగా విడిపోవడమే. ఒకప్పుడు కలిసికట్టుగా సినిమాలు చేస్తూ ఎన్నో గొప్ప కథలని అందించిన బాలీవుడ్ ని ఇప్పుడు డిజాస్టర్స్ వెంటాడుతున్నాయి. ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకోవడం లేదు. దీనికి కారణం బాలీవుడ్ ఇండస్ట్రీలో రాజకీయాలు, మీడియా ప్రభావం కారణం అని చెప్పొచ్చు.

బిటౌన్ లో ఒక వర్గం హీరో, హీరోయిన్స్ యాంటీ మోడీ స్టాండ్ తీసుకున్నారు. అమీర్ ఖాన్ లాంటి స్టార్ సైతం మోడీకి వ్యతిరేకంగా మాట్లాడారు. అలాగే మరికొంత మంది హీరోయిన్స్ కి బీజేపీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలకి మద్దతు ఇచ్చి యాంటీ మోడీ టీమ్ లోకి వెళ్ళిపోయారు. అక్షయ్ కుమార్, కంగనా రనౌత్, వివేక్ అగ్నిహోత్రి లాంటి వారి బీజేపీ సపోర్టర్స్ గా ఉన్నారు.

అనవసరమైన రాజకీయాలలో జోక్యం చేసుకోవడం వలన ఖాన్ లు, సెలబ్రిటీ వారసుల నుంచి వచ్చే చిత్రాలపై రిలీజ్ కి ముందు నుంచే హిందూ వర్గాల నుంచి విపరీతమైన నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. ఇది సినిమా ఫెయిల్యూర్ కి కారణం అవుతుంది. అయితే ఈ మధ్య అక్షయ్ కుమార్ హిందుత్వ అంశాలని ప్రధానంగా చేసుకొని చేసిన సామ్రాట్ పృధ్వీరాజ్, రామ్ సేతు డిజాస్టర్ అయ్యాయి.

వీటిని యాంటీ బీజేపీ గ్యాంగ్ సోషల్ మీడియాలో టార్గెట్ చేశాయి. ఇలా రాజకీయ ముద్ర ని బాలీవుడ్ సెలబ్రిటీలు వేసుకోవడం వలన నటులకి ఏమీ కాకుండా నిర్మాతలు మాత్రం దారుణంగా నష్టపోతున్నారు.

ఇప్పుడు అదే ముద్ర టాలీవుడ్ హీరోలపై పడే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ క్లైమాక్స్ లో శ్రీరాముడి తరహాలో కనిపించేసరికి హిందుత్వ అభిమానులు విపరీతంగా ఆదరించారు. ప్రస్తుతం ఆదిపురుష్ లో ప్రభాస్ కూడా రాముడిగా కనిపిస్తున్నాడు. దీనిపై కూడా ఇప్పటికే హిందుత్వ ముద్ర పడిపోయింది.

ఇప్పుడు చరణ్ అభిషేక్ అగర్వాల్ తో కలిసి ది ఇండియా హౌస్ అనే మూవీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే అభిషేక్ అగర్వాల్ ది కాశ్మీర్ ఫైల్స్ అనే చిత్రాన్ని చేశారు. ఈ మూవీ హిట్ అయిన ఒక వర్గం నుంచి ముఖ్యంగా యాంటీ బీజేపీ నుంచి విపరీతమైన వ్యతిరేకత సొంతం చేసుకుంది.

ఇదొక ప్రాపగాండా మూవీగా అభివర్ణించారు. ఇప్పుడు అలాంటి చరిత్ర చెప్పని నిజం అంటూ ది ఇండియా హౌస్ స్టొరీని చెబుతున్నారు. దీనిని హిందుత్వ వాదులు ఓన్ చేసుకోవడంతో పాటు బీజేపీయేతర వర్గాలు వ్యతిరేకించే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఈ టాలీవుడ్ స్టార్స్ పై కూడా రాజకీయ పరమైన ముద్ర పడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తూ సినిమాలు చేయడం వలన ఎంత నష్టం జరుగుతుంది అనేది కనిపిస్తూనే ఉంది.